గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా - సీఎం రేవంత్ ఛాయిస్..!!

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులు పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ కీలక దిశా నిర్దేశం చేసారు. ఇక.. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాల పైనా స్పష్టత ఇచ్చారు. ఇక.. ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పార్టీ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారుతున్న వేళ.. సీఎం క్లియర్ గా సంకేతాలు ఇచ్చారు. రేసులో ఉన్నవారిలో ఉత్కంఠ పెరుగుతోంది.

ఎల్‌నినో దెబ్బ, కరువు ముప్పు.. పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్!
ఎల్‌నినో దెబ్బ, కరువు ముప్పు.. పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్!

తెలంగాణలో గవర్నర్ కోటా మూడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కానున్నాయి. ఈ సీట్ల ఖరారు పైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ ఈ సీట్ల ఖరారు వేళ పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారు. సామాజిక వర్గాల వారీగా ఎవరికి సీట్లు కేటాయిస్తారనేది స్పషత వస్తోంది. ఓ స్థానాన్ని పద్మశాలీలకు, మరోస్థానాన్ని ముదిరాజ్ కులస్తులకు కేటాయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు రేవంత్ ఇచ్చిన సంకేతాలు క్లియర్ గా ఉన్నాయి.

దక్షిణాది రాష్ట్రాల భద్రత, నేరాల కట్టడికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
దక్షిణాది రాష్ట్రాల భద్రత, నేరాల కట్టడికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
CM Revanth Reddy Focuses on Telangana Governor Quota MLC Selections Final Shortlist Underway

ఇక.. మూడో స్థానం కోసం పోటీ పెరుగుతోంది. సామాజిక సమీకరణాలే కీలకంగా మారాయి. తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలు, వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులు సైతం ఈ మూడో స్థానం కోసం పోటీ పడుతున్నారు. కాగా.. పద్మశాలి వర్గం నుంచి కొండడా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డాక్టర్ పవిత్ర వాణి కి ఛాన్స్ దక్కుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

అదే విధంగా మరో సీటు ముదిరాజ్ వర్గానికి ఇవ్వటం దాదాపు ఖాయమైంది. అందులో భాగంగా ఈ వర్గం నుంచి నీలం మధు, ఎం. సునీత రావు వంటి నాయకులు తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు.మూడో స్థానం కోసం ఓసీ వర్గాల నుంచి ఆర్‌టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ రావు, గుండెపల్లి దయా సాగర్, పవన్ మల్లాది, టీపీసీసీ ఉపాధ్యక్షుడు టి. కుమార్ రావు, టీశాట్ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తదితరులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

అదే విధంగా ఎస్సీ వర్గాలకు కేటాయిస్తే సంపత్ కుమార్ కు ఛాన్స్ దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. బీసీ వర్గాల నుంచి సట్టు మల్లేశం, చనగాని దయాకర్, చరణ్ కౌశిక్ యాదవ్, లోకేష్ యాదవ్, నేరెళ్ల శారద పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నాయి. దీంతో.. మూడో స్థానంలో రేవంత్ ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తి కరంగా మారుతోంది. వచ్చే వారం ఈ పేర్ల పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+