ఎవర్రా మా సర్కారును పడగొట్టేది: కేసీఆర్‌పై రేవంత్ సంచలనం, 2 పథకాలు, 15వేల ఉద్యోగాలు

ఆదిలాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. మూడు నెలల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం అవుతారని కొందరు అంటున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదన్నారు రేవంత్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన 'తెలంగాణ పునర్నిర్మాణ సభ' రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన వచ్చినోళ్లను గ్రామాల్లోకి వస్తే చెట్టుకు కట్టి కోదండం వేసి కొట్టాలన్నారు.

ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వాన్ని పడగొడతామంటూ ఎవరైనా మాట్లాడితే వాళ్ల పళ్లు రాలగొడతామంటూ సీఎం రేవంత్ హెచ్చరించారు. లక్ష కోట్ల దోపిడీతో.. గాలికి కొట్టుపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కాదని.. ఇది ప్రజా ప్రభుత్వమని అన్నారు. ప్రభుత్వం కూలిపోతుందనే భ్రమల్లో కేసీఆర్ ఉన్నారని.. కేసీఆర్ ఖందాన్ మొత్తం వచ్చినా పండబెట్టి కొడతామని హెచ్చరించారు.

CM Revanth reddy hits out at kcr and brs leaders in indravelli public meeting

కేసీఆర్ మళ్లీ సీఎం కాదు కదా.. మంత్రి కూడా కాలేరన్నారు. నిత్యానంద స్వామిలా.. కేసీఆర్ అక్రమ సంపాదనతో ఓ దీవికి రాజు కావచ్చని.. లేదంటే తన ఫాంహౌస్‌కు సీఎం అవుతాడేమో.. కానీ, రాష్ట్రానికి మాత్రం సీఎం కాలేరని అన్నారు రేవంత్. ప్రజలకు కేసీఆర్ చేసిన పాపాలకు అనుభవించాల్సిందేనని అన్నారు. అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను విధ్వంస రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.

ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని సీఎం రేవంత్ చెప్పారు. గూడేలకు రోడ్లు, నాగోబా ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత తీసుకుంటామన్నారు. 1981లో కాంగ్రెస్ వాళ్లే ఇంద్రవెల్లిలో అడవి బిడ్డలను పొట్టన పెట్టుకున్నారని కొందరు విమర్శించారని.. ఇంద్రవెల్లి దారుణంపై తాను ఆనాడే క్షమాపణ చెప్పినట్లు రేవంత్ తెలిపారు. సీమాంధ్ర పాలకుల హయాంలో ఆ తప్పు జరిగిందన్నారు. ఆ తప్పులను సరిచేసేందుకే సోనియా తెలంగాణ ఇచ్చారని తెలిపారు.

ఈ దేశంలో ఉన్న రెండే కూటములు అని. ఒకటి ఎన్డీఏ, రెండోది ఇండియా కూటమి అని చెప్పారు రేవంత్. ఈ రెండు కూటముల సహకారం లేకుండా కేసీఆర్ ఎలా కేంద్రంలో చక్రం తిప్పుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే మోడీ దగ్గర తాకట్టుపెట్టి కేసీఆర్ గులాంగిరి చేస్తారని రేవంత్ అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఇక్కడ్నుంచి గెలిచిన సోయం బాపూరావుకు మంత్రి పదవి కూడా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు.

త్వరలోనే 15 వేల కానిస్టేబుళ్ల భర్తీ: రూ. 500కే గ్యాస్, ఉచిత విద్యుత్

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాలేదు.. అప్పుడే బీఆర్ఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్. వచ్చే 15 రోజుల్లోనే 15వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. త్వరలోనే రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్నీ అమలు చేస్తామని రేవంత్ తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల పోస్టులు భర్తీ చేసే బాధ్యత తమదేనన్నారు. ఇప్పటికే 7వేల స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+