Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్.. దేశంలోనే తొలి సీఎంగా..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరుదైన ఘనత సాధించనున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో లీడర్ షిప్ 21 సెంచరీ అనే ప్రోగ్రాంలో అటెండ్ కానున్నారు. ఈ మేరకు హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్ షిప్ ప్రోగ్రాం కు ఎన్ రోల్ అయ్యారు. స్వతంత్ర భారత్ లో ఈ ఘనత సాధించిన తొలి సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు. ఈ మేరకు జనవరి 25 నుంచి 30 వరకు జరగనున్న తరగతులకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మసాచుసెట్స్ లోని కెన్నడీ స్కూల్, కేంబ్రిడ్జిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ తరగతులకు హాజరుకానున్నట్లు సమాచారం.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు. దేశంలో ప్రస్తుతం పదవిలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక కోర్స్ సర్టిఫికెట్ అందుకోబోతున్న మొదటి ముఖ్యమంత్రిగా ఒక అరుదైన ఘనత సాధించబోతున్నారు. ప్రపంచంలోని నంబర్ వన్ విద్యాసంస్థలలో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో "లీడర్‌షిప్: 21 సెంచరీ" అనే కోర్స్‌కు హాజరుకాబోతున్నారు. దీనితో, భారతదేశ చరిత్రలో ఒక ఐవీ లీగ్ కార్యక్రమానికి హాజరవుతున్న మొదటి ముఖ్యమంత్రి రేవంతే అవుతారు. ఈ కోర్స్ పేరు.. "21వ శతాబ్దంకోసం నాయకత్వం(అస్తవ్యస్తత, సంఘర్షణ, ధైర్యం)" ఈ కోర్స్ కోసం ఆయన ఈ నెల 25 నుంచి 30 వరకు మసాచుసెట్స్‌లోని కెనడీ స్కూల్ క్యాంపస్‌లో ఉండి తరగతులకు హాజరవుతారు.

సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు క్లాసులకు అటెండ్ అవుతారు. అసైన్ మెంట్స్ చేస్తారు. అలాగే హోమ్ వర్క్స్ సబ్‌మిట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కు టిమ్ ఓబ్రెయిన్ ఛైర్మన్ గా ఉన్నారు. ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రొ. కరెన్ మోరిస్సీ. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని కేస్ స్టడీస్ ను విశ్లేషించనున్నారు. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న గ్రూపులు ప్రస్తుత సమస్యలను క్లాస్ రూమ్ లో పరిష్కరిస్తారు. ఈ క్రమంలో హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ కోర్సు సర్టిఫికేషన్ తీసుకోనున్నారు. భారత చరిత్రలోనే ఈ గౌరవం పొందనున్న తొలి సీఎంగా రేవంత్ రెడ్డి నిలవనున్నారు.

ఇక ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీని 1607 లో స్థాపించారు. ఇది ప్రైవేట్ ఐవీ లీగ్ రీసెర్చ్ యూనివర్సిటీగా ఉంది. మసాచుసెట్స్ లోని కేంబ్రిడ్జిలో ఈ యూనివర్సిటీ నెలకొని ఉంది. గత 100 ఏళ్లలో ఈ యూనివర్సిటీ దాదాపు 75 సార్లు వరల్డ్ నెం. 1 గా ఉంది. ఈ యూనివర్సిటీ కింద 14 స్కూళ్లు ఉన్నాయి. బిజినెస్, లా, మెడికల్, గవర్న్ మెంట్, థియోలజీ తదితర సంబంధిత విభాగాల్లో ఈ స్కూల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా అల్లాన్ గార్బర్ ఉన్నారు.

CM Revanth Reddy Joins Prestigious Harvard Leadership Program

ఇక కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ 1936లో స్థాపించబడింది. 1966లో అధ్యక్షుడు కెన్నెడీ పేరు పెట్టబడింది. గ్రాడ్యుయేట్, మాస్టర్స్ మరియు ఎగ్జిక్యూటివ్ కోర్స్‌లు అందిస్తుంది. 2002: 52 శాతానికి పైగా మహిళా విద్యార్థులు ఉన్నారు. 2011: 75వ వార్షికోత్సవం / విశ్వవిద్యాలయం 375 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2014: పూర్వ విద్యార్థులు, దాతల నుండి ½ ట్రిలియన్ డాలర్లు సేకరించింది. అలాగే 2026: 100 కంటే ఎక్కువ దేశాలకు చెందిన విద్యార్థులతో, హార్వర్డ్‌లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులు చదివే కళాశాలలో ఒకటిగా కెన్నెడీ స్కూల్ నిలిచింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+