తెలంగాణలో ఏపీ తరహా యాప్: ప్రారంభించిన రేవంత్ రెడ్డి

T-SAFE app: మహిళలకు 24 గంటల పాటు భద్రత కల్పించడానికి ఏపీ ప్రభుత్వం గతంలో దిశ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం.. ఏపీలో నాలుగున్నర లక్షల మందికి పైగా యూజర్లు తమ స్మార్ట్‌ ఫోన్లల్లో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రయాణ సమయాల్లో ఏవైనా అనుకోని సంఘటనలు సంభవించితే పోలీసుల సహాయాన్ని తీసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. తాము ఉన్న ప్రదేశానికి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు ఎస్ఓఎస్ మెసేజీ వెళ్తుంది. సహాయం కోరిన వారు ఎక్కడ ఉన్నారనేదీ పోలీసులకు ఈ యాప్ ద్వారా సులువుగా తెలిసిపోతుంది.

CM Revanth Reddy launches T safe app

ఎస్ఓఎస్ సందేశాన్ని పంపించిన అతి కొద్ది నిమిషాల్లోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలా ఈ యాప్‌ను డిజైన్ చేశారు. చాలా సందర్భాల్లో ఈ యాప్ మహిళలకు భద్రత కల్పించింది కూడా. దీనిపై పలు కథనాలు సైతం మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే.

ఇలాంటి యాప్‌ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. దీనికి టీ- సేఫ్ (T-SAFE) అని పేరు పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఈ యాప్‌ను ఆవిష్కరించారు. దీనిపై ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించడానికి వీలుగా మహిళా పోలీసు భద్రతా విభాగం రూపొందించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల భద్రత, ప్రయాణ సమయంలో వారిని పర్యవేక్షించడానికి వీలుగా టీ- సేఫ్ యాప్‌ను రూపొందించినట్లు మంత్రులు తెలిపారు.

మహిళలు ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో తక్షణ సహాయాన్ని అందించడానికి, లైవ్‌ లొకేషన్‌ షేర్ చేయడానికి, ప్రయాణమార్గం నావిగేట్‌ చేయడానికి, ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసిగట్టి పోలీసులు అప్రమత్తం కావడానికి వీలైన అనేక ప్రత్యేక ఫీచర్లను టీ-సేఫ్ యాప్‌లో ఉన్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+