హఠాత్తుగా ట్యాంక్ బండ్ వద్ద కనిపించిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా కొనసాగిన వినాయకుడి నవరాత్రి ఉత్సవాలకు నేటితో తెరపడనుంది. విఘ్న నాయకుడు నిమజ్జనానికి తరలుతున్నాడు. జంటనగరాల్లో కన్నుల పండువగా గణేష విగ్రహాల శోభాయాత్రలు మొదలయ్యాయి. పాతబస్తీ సహా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం వేడుకల సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి. వినాయక విగ్రహాల నిమజ్జనం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. ఈ తెల్లవారు జాము నుంచే వందల సంఖ్యలో వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నాయి.

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన విశ్వ మహాగణపతి శోభాయాత్ర కొద్దిసేపటి కిందటే ముగిసింది. భారీ క్రేన్ సహాయంతో ఈ 69 అడుగుల మహా విగ్రహాన్ని ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. అంతకుముదు- ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల, లక్షలాదిమంది భక్తజన సందోహం మధ్య మధ్య బడా గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. ముందుగా ఊహించినట్టే మధ్యాహ్నం 1:20 నిమిషాలకు మహాగణపతిని నిమజ్జనం చేశారు.

CM Revanth Reddy made a surprise visit of the Ganesh idols immersion process at Tankbund

ఈ నిమజ్జనోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. నేరుగా ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్లు, నగర పోలీస్ కమిషనర్, ఇతర అధికారుతో కలిసి నెక్లెస్ రోడ్ మార్గంలో ఫుట్‌పాత్‌పై కలియతిరిగారు. ఖైరతాబాద్ బడా గణపతిని నిమజ్జనం చేసిన క్రేన్ నంబర్ 4 వద్దకు వెళ్లారు. నిమజ్జనం తీరుతెన్నులను అక్కడి అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

క్రేన్ ఆపరేటర్లతో మాట్లాడారు. విగ్రహాల నిమజ్జన సమయంలో వాళ్లు పాటించే జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయం, ట్యాంక్ బండ్ వైపు కారు ఫుట్ బోర్డ్ పై నిల్చుని కలియతిరిగారు. అశేష జనావళికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనూహ్యంగా రేవంత్ రెడ్డి తమ మధ్యలో ప్రత్యక్షం కావడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, సెల్ఫీలు దిగడానికి జనం ప్రయత్నించారు.

ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు కూడా లేకపోవడంతో కాన్వాయ్ కు ఎదురుగా వెళ్లారు ప్రజలు. ఒక దశలో ఆయన కారు ముందుకు సాగడం కూడా కష్టమనిపించింది. దీంతో ఫుట్ బోర్డ్ పై నిల్చుని ప్రజలకు అభివాదనం చేస్తూ ముందుకు సాగారు. సాదాసీదాగా, సామాన్యుడిలా ఆకస్మికంగా నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+