Revanth Reddy: అంగన్ వాడీలకు షాకిచ్చిన సీఎం రేవంత్..!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగన్ వాడీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తో పాటు బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనివారం సీఎం రేవంత్ మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికిమంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి ఇతర అధికారులు హాజరయ్యారు.
అంగన్ వాడీల ద్వారా బాలింతలు, గర్భిణీలకు మంచి పౌష్టికాహారం అందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. పౌష్టికాహార పంపిణీ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొబైల్ అంగన్ వాడీల కేంద్రాలను పరిశీలించాలన్నారు. అంతకు ముందు సీఎం రేవంత్ హెచ్ఎండీఏ సంబంధించి అధికారులతో చర్చించారు.

హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలన్న ప్రతిపాదనకు సీఎం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హెచ్ఎండీఏ పరిధిలో జీహెచ్ఎంసీ, పాటు మరో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటిని హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా మార్చే అవకాశం ఉంది.
మొత్తం ఒకే కార్పొరేషన్ గా చేస్తే ఇబ్బంది అయ్యే అవకాశం ఉండడంతో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ పేరుతో నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ పరిధి ఉండే అవకాశం ఉంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications