ఇకపై హైదరాబాద్ లో పాడ్ ట్యాక్సీలు: ఏడాదిలోపే- అండర్ పాస్, ఫ్లైఓవర్ల నిర్మాణం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ క్యూర్ జోన్ పరిధిలో రోడ్లు, రవాణా, ఇతర మౌలిక వసతుల వ్యవస్థలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ప‌ర్స‌న‌ల్ ర్యాపిడ్ ట్రాన్సిట్, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం, రహదారుల విస్తరణ, రేడియల్ రోడ్స్ వంటి పలు అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. వాటన్నింటిపై జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్ బోర్డ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

క్యూర్ ప‌రిధిలో ప్ర‌జా ర‌వాణా మెరుగుదల, ప్రధాన రోడ్ల అనుసంధాన‌ం, రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగం గురించి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆయా పనులన్నీ కూడా గడువులో పూర్తి చేయాల్సి ఉంటుందని ఆదేశించారు. భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా క్యూర్ ప‌రిధిలో ప్ర‌జా ర‌వాణా స‌దుపాయాలను మరింత మెరుగుప‌రచాల‌ని చెప్పారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

CM Revanth Reddy Pushes Hyderabad CURE Zone with Personal Rapid Transit and Smarter Roads

హైదరాబాద్ లో ర‌ద్దీ ప్రాంతాల్లో ప‌ర్స‌న‌ల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్ట‌మ్ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన అంశాల‌పై అధికారులు రేవంత్ రెడ్డి ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. దీనిపై రేవంత్ రెడ్డి కొన్ని సూచ‌న‌లు చేశారు. ఎక్కువమంది ప్ర‌జ‌లు రాకపోకలు సాగించే ప్రాంతాలతో పాటు బాలానగర్, జీడిమెట్ల వంటి పారిశ్రామికవాడల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు ప్రయాణించే ప్రాంతాలను మెట్రో, ఎంఎంటీఎస్, బ‌స్ స్టేష‌న్ల‌తో అనుసంధానించేలా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ ను డిజైన్ చేయాల‌ని సూచించారు.

బ్రహ్మోత్సవ శోభ: తిరుపతి గరుడ సర్కిల్స్, నంది సర్కిల్స్, అలిపిరిల్లో.. !!
బ్రహ్మోత్సవ శోభ: తిరుపతి గరుడ సర్కిల్స్, నంది సర్కిల్స్, అలిపిరిల్లో.. !!

ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ పీఆర్టీల‌పై అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించాల‌ని రేవంత్ రెడ్డి ఆదేశించారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌నులు ప్రారంభ‌ం అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఇందులో ప్రధాన కాల‌నీల ఎంపిక‌, అత్యాధునిక సాంకేతిక‌త‌, నిర్వ‌హ‌ణకు పెద్దపీట వేయాల‌ని అన్నారు. ఆయా పనులన్నీ కూడా గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుందని డెడ్ లైన్ పెట్టారు.

హైఓల్టేజ్ నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో ప్రభంజనం
హైఓల్టేజ్ నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో ప్రభంజనం

క్యూర్ ప‌రిధిలో వివిధ ప్రాంతాల మ‌ధ్య అనుసంధాన‌త పెరిగేలా, ర‌హ‌దారుల్లో స‌జావుగా రాక‌పోక‌లు సాగించేలా ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్‌పాస్‌ల నిర్మాణం వేగ‌వంతం చేయాల‌ని రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వ‌న్‌వేకు వివిధ కాల‌నీలు, ర‌హ‌దారుల నుంచి వ‌చ్చే ర‌హ‌దారులు క‌లిసే చోటుతో పాటు ఫ్రీ లెఫ్ట్, యూట‌ర్న్‌ల విష‌యంలో తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ గురించి అధికారులు ఆయనకు వివ‌రించారు.

యూటిలిటీస్ త‌ర‌లింపును వేగ‌వంతం చేసి ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని, నాగార్జున స‌ర్కిల్ నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్ వైపు ఫ్లైఓవ‌ర్ ప‌నులను వేగ‌వంతం చేయాల‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. ముంబై వంటి న‌గ‌రాల్లో ఏడాదిలోపే ప‌నులు పూర్త‌వుతున్నాయ‌ని, అక్క‌డ వినియోగిస్తున్న సాంకేతిక‌త‌, ప‌నుల చేపట్టే విధానంపై అధ్య‌య‌నం చేయాల‌ని సూచించారు. ప్రారంభించిన ప‌నులు ఏడాదిలోపు పూర్త‌య్యేలా చూడాల‌ని చెప్పారు.

హైద‌రాబాద్‌-ముంబై బుల్లెట్ ట్రైన్ మార్గానికి స‌మాంత‌రంగా రేడియ‌ల్ రోడ్డు నిర్మాణంపై అధ్య‌య‌నం చేయాల‌ని చెప్పారు. శంక‌ర్‌ప‌ల్లి - చేవెళ్ల మ‌ధ్య ఇప్పుడు ఉన్న ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌తో పాటు నూత‌న రోడ్ల నిర్మాణానికి ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని అన్నారు. ఫ్యూచర్ సిటీ, చంద‌న్‌వ‌ల్లి, ఆలూరులోని డాటా సెంట‌ర్లు, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగించుకునేందుకు వీలుగా ప‌నులు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+