అల్లు అర్జున్ వీడియోపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఇదే
ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun) ఇటీవల డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీమ్‌కు మద్దతు ప్రకటిస్తూ తనవంతు బాధ్యతగా ప్రత్యేక వీడియో చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్‌ను అభినందిస్తూ పోస్టు పెట్టారు.
'డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేలా అల్లు అర్జున్ వీడియో చేయడం ఆనందంగా ఉంది. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం' అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. #DrugFreeTelangana, #SayNoToDrugs వంటి పలు హ్యాష్‌ట్యాగ్స్‌ను జత చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ పోస్టుపై అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు.

'గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు' అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. మరిన్ని ఇలాంటి మంచి కార్యక్రమాలను అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Respected Chief Minister Revanth Reddy Garu … I would personally like to take a moment and appreciate you for the initiative to have taken to make Hyderabad city and our state a drug free place . And I see a lot of initiatives taken to do so . Respect 🙏🏽
— Allu Arjun (@alluarjun) November 29, 2024
కాగా, 'మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1908కు ఫోన్ చేయండి. వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లి.. సాధారణ జీవనశైలి అలవాటు పడేవరకూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశం వారిని శిక్షించడం కాదు.. వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం' అని అల్లు అర్జున్ తన వీడియో ద్వారా తెలియజేశారు.
As we stood united against drugs, we now stand stronger with the SHE Team, ensuring every woman’s right to safety and security. Together, let’s create a safer and better tomorrow. 💜@revanth_anumula @TelanganaCMO @TG_ANB @TelanganaCOPs pic.twitter.com/tDqfX86xHz
— Rashmika Mandanna (@iamRashmika) November 29, 2024
మరోవైపు, పుష్ఫ, పుష్ప-2లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటించిన నటి రష్మిక మందన్న కూడా తెలంగాణ షీ టీమ్‌కు మద్దతుగా ఓ వీడియో చేశారు. బయటకు వెళ్లే అమ్మాయిలు ఎవరూ భయపడొద్దని, ఒకవేళ అన్యాయం జరిగితే షీ టీమ్‌ని ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.












Click it and Unblock the Notifications