కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలి: సీఎం రేవంత్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గురువారం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై స్పందించారు. బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామని, అసెంబ్లీ చివరి రోజు బీఆర్‌ఎస్‌ సభ్యుల సంఖ్యను ప్రకటించారని తెలిపారు. 38 మంది అని ప్రకటించినప్పుడు బీఆర్‌ఎస్‌ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు.

2019 నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ పీఏసీ ఛైర్మన్‌గా ఎలా ఉంటారు? అని సీఎం రేవంత్ నిలదీశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎంకు పీఏసీ ఛైర్మన్‌ ఎలా ఇచ్చారు? అని సీఎం ప్రశ్నించారు. బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ, వాళ్లకు టికెట్లు ఇవ్వొద్దా? అని అడిగారు. బతకడానికి వచ్చినోళ్లు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు.

CM Revanth Reddy response On Kaushik Reddy Issue

కౌశిక్‌రెడ్డి మాటలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే మంచిదేన్నారు. ముఖ్యమంత్రి కోర్టుల నిర్ణయాలు తమకే మేలు చేస్తాయని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలు చేజారకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం బలంగానే ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.

కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. రాష్ట్ర రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ వంటి పలు అంశాలపై చర్చించారు. వర్షాలు-వరదలపైనా మాట్లాడుకున్నట్లు తెలిసింది. మరోవైపు కేసీ వేణుగోపాల్‌తో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిని అమిత్‌ షాకు వివరించనున్నారు రేవంత్. రాష్ట్రంలో వరద నష్టం వివరాలను హోంమంత్రికి వివరించి కేంద్రం సాయం కోరే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక అమిత్‌ షాతో భేటీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణపై వీరితో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+