డ్రగ్స్‌ నిర్మూలనపై నో కాంప్రమైజ్: కఠిన చర్యలుంటాయంటూ సీఎం రేవంత్ హెచ్చరిక

హైదరాబాద్: డ్రగ్స్ నిర్మూలనలో ఎలాంటి రాజీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రేవంత్ రెడ్డి.. ఎక్సైజ్, నార్కోటిక్ డ్రగ్స్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, హెచ్ న్యూ అదనపు డీజీ సీవీఆనంద్, సీఐడీ అదనపు డీజీ మహేష్ భగవత్, పోలీసు అధికారులు హాజరయ్యారు.

రాష్ట్రంలో మాదకద్రవ్యాల(Drugs) కట్టడిపై యత్రాంగంతో సమాలోచనలు చేశారు. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌ సరఫరాను నియంత్రించి వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. డ్రగ్స్‌ వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్‌ హెచ్చరించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమిస్తామని సీఎం ప్రకటించారు.

cm revanth reddy review on drug prohibition in telangana state

యాంటీ నార్కోటిక్ బ్యూరో విభాగాన్ని బలోపేతం చేయాలని, డ్రగ్స్‌ చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినపడకూడదని స్పష్టం చేశారు. డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు.

సేవ్ సొసైటీ.. సేవ్ జనరేషన్.. సేవ్ కిడ్స్ నినాదంతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ సూచించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎవరూ కాంప్రమైజ్ కావొద్దన్నారు. డ్రగ్స్ తీసుకోవాలంటే భయపడాలన్నారు. డ్రగ్స్ రవాణాను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలన్నారు. తెలంగాణలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించాలని ఆదేశించారు. శాఖాపరమైన బలోపేతం కోసం ఏది కావాలంటే అది చేస్తామన్నారు. డ్రగ్స్ నిర్మూలన ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నారు. ప్రతి నెలా నార్కోటిక్ బ్యూరోపైన తప్పకుండా రివ్యూ చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం వరుసగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. సోమవారం ఉద్యోగాల భర్తీపై ఆయన రివ్యూ నిర్వహించారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్‌పీఎస్సీ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతోపాటు నోటిఫికేషన్ వివరాలతో తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+