Revanth Reddy: ఆర్ఎస్పీ సామాజిక స్పృహ వ్యక్తి.. రేవంత్ రెడ్డి..
విద్యుత్ కోతలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొందరు కావాలనే కరెంట్ కట్ చేస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణం లేకుండా విద్యుత్ కోతలు విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రేవంత్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఆదివారం మీట్ ది మీడియా ఈవెంట్ లో పాల్గొన్నారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ విద్యుత్ ఇస్తున్నామని రేవంత్ అన్నారు.
అక్కడక్కడ విద్యుత్ కోతలు విధిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తిప్పి కొడుతామని అన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదని రేవంత్ హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబం రూ.వేల కోట్ల అవితీకి పాల్పడిందని రేవంత్ ఆరోపించారు.

అక్రమార్కులపై చట్టపరంగా శిక్షిస్తామన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా రాష్ట్రంలో అనేక భూసమస్యలు ఉన్నాయని చెప్పారు. వాటి పరిష్కరాలకు చర్యలు చేపట్టామని వివరించారు. గతంలో ప్రైవేట్ సంస్థ చేతిలో ధరణి పోర్టల్ ఉండేదని ఇప్పుడు ప్రభుత్వ చేతిలోకి వచ్చిందని తెలిపారు. 5 ఎకరాల లోపు ఉన్న వారందరికీ రైతు బందు పడిందని రేవంత్ పేర్కొన్నారు. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్ అని అన్నారు.
రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడంపై రేవంత్ స్పందించారు. ఆర్ఎస్పీ బీఆర్ఎస్ పార్టీలో చేరటంపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనకు మంచి మిత్రుడని రేవంత్ తెలిపారు. ఆయన సామాజిక స్పృహ ఉన్నవాడని.. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతాడని తాను అనుకోవటం లేదని చెప్పారు. ప్రవీణ్ కుమార్ పట్ల తనకు ఇప్పటికీ గౌరవం ఉందని రేవంత్ చెప్పారు.












Click it and Unblock the Notifications