మీకు భయపడాలా? కిషన్ రెడ్డిపై రేవంత్ మాములుగా కాదు!

హైదరాబాద్: కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రంపైనా తీవ్ర విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు ప్రాజెక్టులు రావడం లేదని.. తెలంగాణ పాలిట ఆయన సైంధవుడిలా మారారని ఆరోపించారు.

కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు అనుమతి లభించడం లేదన్నారు రేవంత్ రెడ్డి. మీరు ప్రత్యేకంగా తెలంగాణకు తెచ్చిన ప్రాజెక్టు ఏంటో చెప్పాలని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామని.. నోరు వేసుకుని బెదిరిస్తే భయపడేవారు ఇక్కడెవరూ లేరని కిషన్ రెడ్డిపై ఘాటుగా స్పందించారు రేవంత్. మెట్రో, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు.

CM Revanth Reddy severely criticized Union Minister Kishan Reddy

సబర్మతి సుందరీకరణను ప్రశంసించిన కిషన్ రెడ్డి.. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును మాత్రం వ్యతిరేకిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. తాము ప్రదాని వ్యక్తిగత ఆస్తులను అడగడం లేదని.. రాష్ట్రం నుంచి కేంద్రానికి భారీగా పన్నులు వెళ్తున్నాయన్నారు. తెలంగాణ చెల్లించిన పన్నుల్లో పావలా కూడా రాష్ట్రానికి రావడట్లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ యూపీ, బీహార్‌లకే ఇస్తోందని రేవంత్ విమర్శించారు.

కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మెట్రో, ఆర్ఆర్ఆర్ తదితర పెండింగ్ ప్రాజెక్టులన్నింటికీ అనుమతులు తీసుకుని హైదరాబాద్ రావాలని కిషన్ రెడ్డికి రేవంత్ సవాల్ విసిరారు. తెలంగాణలో కేంద్రం ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పాలన్నారు. మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయా? అని కిషన్ రెడ్డి అవహేళన చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కిషన్ రెడ్డి కేసీఆర్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. తాము ఢిల్లీకి వెళ్లి లిక్కర్ దందాలు చేయడం లేదని.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వెళ్తున్నామన్నారు రేవంత్.

ఏ రాష్ట్రంపైనా ఒక భాషను బలవంతంగా రుద్దొద్దని సీఎం రేవంత్ కేంద్రంపై మండిపడ్డారు. తెలంగాణలో తెలుగు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. తాము జీవోలను తెలుగులోనే ఇస్తున్నామన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారని.. కానీ, సీట్లు పెరుగుతాయని చెప్పడం లేదన్నారు. దక్షిణాదికి అన్యాయం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+