హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతాం - సీఎం రేవంత్
హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్క్‌లో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ ను సీఎం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ పారిశ్రామిక విస్తరణలో మరో మైలురాయిగా నిలుస్తుందని అంటున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగానికి పెట్టుబడులను ప్రోత్సహిస్తూ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన 'తెలంగాణ రైజింగ్ 2047' అనే విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇది Telangana @100 దృష్టిలో ఉన్న వ్యూహాత్మక ప్రణాళికగా పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్ తరాల కోసం నిర్మితమవుతున్న గ్లోబల్ వేదిక అని కితాబిచ్చారు.

మలబార్ గ్రూప్‌పై అభినందనల వెల్లువ..
తెలంగాణపై నమ్మకంతో భారీ పెట్టుబడులు పెట్టిన మలబార్ గ్రూప్‌కి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. "మహేశ్వరంలో జ్యువెలరీ తయారీ యూనిట్‌ను ప్రారంభించడమే కాకుండా, స్థానిక అభివృద్ధి, ఉపాధికి ఇది కొత్త దారి చూపుతోందని అన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో విశ్వసనీయ పెట్టుబడి వాతావరణానికి నిదర్శనం అని కొనియాడారు.
భారత్ ఫ్యూచర్ సిటీ..
మహేశ్వరం ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో.. "ఫోర్త్ సిటీ - భారత్ ఫ్యూచర్ సిటీ" నిర్మాణాన్ని కూడా ప్రకటించారు సీఎం. దీనిద్వారా ప్రాంతీయ అభివృద్ధితో పాటు లక్షలాది ఉద్యోగావకాశాలు కలుగుతాయని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా.. వాటి ద్వారా ఆ పెట్టుబడిదారులకు లాభదాయకత కూడా కలగాలి అనే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు, పారదర్శకత అందిస్తూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడే వేళ బిగ్ ట్విస్ట్, ఇక తప్పదా..!! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications