రేవంత్ సలహా మండలి సిద్దం - కోదండరాం కు కీలక బాధ్యతలు..!!
సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన మార్క్ చూపించుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మంత్రులకు శాఖల కేటాయింపులో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కీలక పోర్టుఫోలియోలను తన వద్దే ఉంచుకున్నారు. ఇదే సమయంలో పాలనలో ప్రధాన అంశాల పైన విమర్శలకు తావు లేకుండా నిర్ణయాలు ఉండాలని భావిస్తున్నారు. ఆ దిశగా సలహా మండలి ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పాలనలో మార్పులు : పాలన సజావుగా సాగే క్రమంలో తనకు సహాయకారులుగా ఉండడానికి వీలుగా సలహాదారులతో కూడిన మండలిని ఏర్పాటు చేసుకునే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఏర్పాటయ్యే సలహామండలికి (అడ్వయిజరీ బోర్డు) చైర్మన్‌గా లేదంటే ముఖ్య సలహాదారుడిగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం నియమితులయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని కీలకశాఖల్లో ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు త్వరలోనే ప్రక్షాళన జరిగే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ హాయంలో తీవ్రచర్చకు కారణమైన విద్యుత్, సాగునీటి రంగాలపై రేవంత్ ఫోకస్ చేసారు. ఇప్పటికే విద్యుత్ రంగం పై సమీక్ష చేసారు.

కీలక నిర్ణయాలతో : రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతోందన్న రేవంత్ వ్యాఖ్యలు ఆ శాఖలో తీవ్రచర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కరెంట్ గురించి గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేదని, ఈ నేపథ్యంలోనే కరెంటు ప్రగతికి సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనలతోనే సీఎం ఆ శాఖను టార్గెట్ చేశారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్నటివరకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ నుంచి ఐదేళ్లుగా కరెంట్‌ను తీసుకున్నారని, బహిరంగమార్కెట్‌లో అధిక రేటుకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని లెక్కలతో సహా వెల్లడించారు. విద్యుత్, ఆర్థిక రంగాలపై సమీక్షలు, యాక్షన్‌ప్లాన్ తర్వాత సీఎం రేవంత్ సాగునీటి రంగంపై దృష్టి సారించే అవకాశముంది.

సలహా మండలి : రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లుగా చేసిన ఖర్చులు, రాబడులకు సంబంధించిన వివరాలు సిద్ధం చేయాలని ఆర్థికశాఖ అధికారులకు తొలి కేబినెట్ భేటీలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినన రేవంత్ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పాలమూరు-రంగారెడ్డిపై ఆయన ప్రత్యేక కసరత్తు చేస్తారని సమాచారం. ఉద్యోగాల కల్పన.. విద్యా సంస్కరణలు..పాలనలో మార్పుల దిశగా కసరత్తులో అనుభవం ఉన్న వారి సేవలను వినియోగించుకోవాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగాంగ శాఖల వారీగా కాకుండా మొత్తంగా ప్రభుత్వానికి సహకరించేలా సలహా మండలి ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications