నేడే 'ఇందిరమ్మ బీమా'కు శ్రీకారం.. హరీశ్‌రావు అడ్డాలో సీఎం రేవంత్‌రెడ్డి పవర్ షో!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకానికి సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం సిద్ధిపేటలో అధికారికంగా శ్రీకారం చుట్టబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీల అమల్లో భాగంగా పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించి వారికి ఆర్థికంగా కొండంత భరోసా ఇవ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేలా ప్రభుత్వ వర్గాలు సిద్దిపేటలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి.

 నువ్వేం ముఖ్యమంత్రివి.. నీదేం భాష - రేవంత్ పై కోమటిరెడ్డి సంచలనం..!!
నువ్వేం ముఖ్యమంత్రివి.. నీదేం భాష - రేవంత్ పై కోమటిరెడ్డి సంచలనం..!!

హరీశ్ ఇలాకాలో సీఎం పాదయాత్ర
ఈ పర్యటనకు అత్యంత రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. గత నెలలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మాజీ మంత్రి హరీశ్ రావు నియోజకవర్గమైన సిద్దిపేటలో అడుగుపెడుతున్నారు. పర్యటనలో భాగంగా సిద్దిపేట ఇందిరా చౌరస్తా నుంచి సభా ప్రాంగణమైన నాగదేవత కూడలి వరకు 2.2 కిలోమీటర్ల మేర సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ పాదయాత్ర చేయనున్నారు. నియోజరవర్గంలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలనే పట్టుదలతో సీఎం ఉన్నారని.. ఈ సభలో ఆయన చేయబోయే ప్రసంగం రాజకీయంగా కీలకం కానుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

CM Revanth Reddy to Launch Indiramma Bima Scheme in Siddipet Today Amid Massive Public Rally

ఐదు జిల్లాల నుంచి జనసమీకరణ.. ఏర్పాట్లు పూర్తి
బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. సిద్దిపేటతో పాటు మెదక్, సంగారెడ్డి, జనగామ, కరీంనగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్వశక్తి సంఘాల మహిళలు, ఇందిరమ్మ పథకం లబ్ధిదారులు భారీ సంఖ్యలో హాజరయ్యేలా గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖల అధికారులు చర్యలు తీసుకున్నారు. బుధవారం మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు.

ఇంటర్ బోర్డు రద్దు వెనుక అసలు కుట్ర ఇదేనా?.. కవిత సంచలన ఆరోపణలు!
ఇంటర్ బోర్డు రద్దు వెనుక అసలు కుట్ర ఇదేనా?.. కవిత సంచలన ఆరోపణలు!

రూ.544.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
బీమా పథకం ప్రారంభంతో పాటు సిద్దిపేట జిల్లా అభివృద్ధి కోసం మొత్తం రూ.544.11 కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో రూ.451.13 కోట్లతో కొత్త పనులకు శంకుస్థాపనలు, ర.92.98 కోట్లతో ఇప్పటికే పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో రూ.200 కోట్ల చొప్పున వెచ్చించి నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు, 7 ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు(రూ.15.44 కోట్లు), 6 తహసీల్దార్ కార్యాలయ భవనాలు(రూ.13.50 కోట్లు), చిన్నకోడూరు(రూ.7.50 కోట్లు), దౌల్తాబాద్(రూ.7.80 కోట్లు) మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, జనగామ నియోజకవర్గంలో మూడు విద్యుత్ సబ్‌స్టేషన్ల(రూ.6.89 కోట్లు) నిర్మాణాలకు సీఎం భూమిపూజ చేస్తారు.

సిద్దిపేట జిల్లాలో రూ.54.67 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్ స్టేషన్లు, కొమురవెల్లి మల్లన్న ఆలయంలో రూ.14.35 కోట్లతో నిర్మించిన వసతి సత్రం, రూ.12 కోట్లతో క్యూ కాంప్లెక్స్, రూ.6.50 కోట్లతో నిర్మించిన 53 గ్రామ మహిళా సంఘాల భవనాలు, రాయపోల్ మండలంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనం(రూ.3.87 కోట్లు), గజ్వేల్‌లో విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయాన్ని(రూ.1.59 కోట్లు) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+