రేవంత్ ఫ్యూచర్ ప్లాన్ ఆవిష్కరణ - కీలక హామీ..!!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ భవిష్యత్ ను ఆవిష్కరించారు. పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చారు. తెలంగాణ ఆర్దిక వ్యవస్థ...భవిష్యత్ లో భాగస్వాములు అయ్యేందుకు కలిసి రావాలని ఆహ్వానించారు. ప్రపంచంలో హైదరాబాద్‌ను చైనాకు ప్లస్ సిటీగా మార్చే వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. దేశం లోనే గొప్ప నగరంగా ఫ్యూచర్ సిటీ నిలుస్తుందని రేవంత్ విశ్వాసం వ్యక్తం చేసారు. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామ ని వెల్లడించారు.
ఇదీ మా లక్ష్యం
సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. హైదరాబాద్ లో ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేసారు. ప్రపంచంలో హైదరాబాద్‌ను చైనాకు ప్లస్ సిటీగా మార్చే వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్ , దుబాయ్ వంటి నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుం దని ఆసక్తికర విశ్లేషణ చేసారు. ఈ నగరంలో ఇందులో సేవారంగం మాత్రమే ఉంటుందని వెల్ల డించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించామని ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

స్పష్టమైన విజన్
కొత్తగా ఆర్టీసీలోకి 3,200 ఈవీ బస్సులను తీసుకువస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా తెలంగాణలో అమ్ముడవుతున్నాయని వివరించారు. రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడుస్తోందని..తమకు రాష్ట్ర భవిష్యత్ పై ఒక విజన్ ఉందని వెల్లడించారు. అదే తెలంగాణ రైజింగ్ అని ఉద్ఘాటించారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొవడానికి హైదరాబాద్ సిద్ధమ వుతోందని వివరించారు. వరదలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్నామని చెప్పారు. మూసీ పునరుజ్జీవనంతో 55 కిలోమీటర్ల వరకు తాగునీటితో ప్రవహించేలా చేయనున్నా మని చెప్పారు. 2050 సంవత్సరానికి అవసరమయ్యే తాగునీటి అవసరాలకు కావాల్సిన కార్యాచరణను ఇప్పటి నుంచే ప్రారంభించామని వివరించారు.
ఇదీ ప్రణాళిక
రీజినల్ రింగ్ రోడ్ ప్రణాళికల దశలో ఉందని తెలిపారు. 360 కి.మీ పొడవు రీజినల్ రింగ్ రోడ్‌ను నిర్మిస్తున్నామని.. దాని చుట్టూ రీజినల్ రింగ్ రైల్వేను ప్లాన్ చేస్తున్నామని సీఎం రేవంత్ సమా వేశం లో వివరించారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ లను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మించబోతున్నామని ప్రకటించారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీలు, సోలార్ వంటి పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. స్కిల్స్, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించామని అన్నారు.
అవుటర్ రింగ్ రోడ్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణలో వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగుల వంటి పైన దృష్టి పెడతామని చెప్పారు. ఏపీలోని బందర్ ఓడరేవుతో అనుసంధానం చేస్తూ ప్రత్యేక రహదారితో పాటు రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలని , మార్కెట్లు స్వేచ్ఛగా పనిచేయాలని తాము కోరుకుంటున్నామని ...తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమతో కలిసి రావాలని కోరారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications