నో 'బెనిఫిట్' - టికెట్ ధరల పెంపు పై తేల్చేసిన రేవంత్..!!
సినీ పెద్దల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తన వైఖరి తేల్చి చెప్పారు. సంక్రాంతి సినిమాల పైన భారం పడకుండా రేవంత్ తో చర్చ వేళ బెనిఫిట్ షోలు .. టికెట్ ధరల పెంపు పైన సినీ పెద్ద లు ప్రతిపాదన చేయాలని భావించారు. కానీ, సమావేశంలో ముందుగానే రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అదే సమయం లో తమ వైఖరి పైనా క్లారిటీ ఇచ్చారు. తాను అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటా నని తేల్చి చెప్పారు. ప్రభుత్వం నుంచి తమ ప్రతిపాదనలు సినీ పెద్దల ముందు ఉంచారు.
సినీ పరిశ్రమకు మద్దతు
ముఖ్యమంత్రి రేవంత్ తో సినీ ప్రముఖుల సమావేశం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. తాజా ఘటన లు.. పరిణామాల పైన సమావేశంలో చర్చకు వచ్చింది. అందరు సీఎంలు సినీ పరిశ్రమను బాగా చూసుకుంటున్నారని.. దిల్ రాజుకు సినీ బాధ్యతలు అప్పగించటం మంచి నిర్ణయమని ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తమను బాగా చూసుకుంటోందని చెప్పు కుచ్చారు. తమ ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని సీఎం స్పష్టం చేసారు. సినీ హీరోల భద్రత కోసం వినియోగించే బౌన్సర్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటామ ని సీఎం రేవంత్ చెప్పారు.

అండగా నిలుస్తాం, కానీ
ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతగా తమ వంతు పాత్రకు సిద్దం కావాలని రేవంత్ సూచించారు. డ్రగ్స్ పై ప్రభుత్వం నుంచి పోరాటం చేస్తుంటే సినీ ఇండ స్ట్రీ నుంచి స్పందన లేదని రేవంత్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ఎవరి పైనా కేసులు పెట్టటం లేదని రేవంత్ చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ నుంచి ప్రభుత్వం ఇచ్చే హామీలకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత తమ పైన ఉందని చెప్పటం ద్వారా తన ఉద్దేశం ఏంటో రేవంత్ సినీ పెద్దలకు అర్దం అయ్యేలా సంకేతాలు ఇచ్చారు. దీని ద్వారా సినీ పెద్దలు ఈ అంశం ప్రస్తావన పైన ఆత్మరక్షణలోకి నెట్టేసారు.

అసెంబ్లీలో చెప్పిందే అమలు
సినీ పరిశ్రమకు కావాల్సిన సహాయ సహకారాలతో పాటుగా ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రభుత్వం నుంచి హామీ దక్కింది. దీంతో, ముఖ్యమంత్రి మూడ్ అర్దం చేసుకున్న సినీ పెద్దలు సంక్రాంతి సినిమాలకు సంబంధించి ఈ సమావేశంలో బెనిఫిట్ షోలు .. టికెట్ ధరల పెంపు పైన ప్రస్తావించే అంశం పైన డైలమాలో ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో టూరిజం.. పెట్టుబడుల విషయంలో సినీ పరిశ్రమ నుంచి సహకారం ఉండాలని రేవంత్ సూచించారు. రాష్ట్రంలో బెనిఫిట్ షోలు.. టికెట్ ధరల పెంపు మాత్రం ఇప్పటికి ఇప్పుడు ఉండదని రేవంత్ తేల్చి చెప్పారు. దీంతో, సినీ పెద్దలకు ప్రస్తుతానికి షాక్ గానే భావిస్తున్నారు. దీంతో..సమావేశం లో తీసుకునే అధికారిక నిర్ణయాల పైన ఇంకా ఆశ .. ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications