హరీష్ నా ఇంటి ముందు చేతులు కట్టుకొని - రేవంత్..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. హరీష్ పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అలాంటివారి భరతం పడుతుందని హెచ్చరించారు. హరీష్ రావు చెప్పులు మోసే రకమని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బుల్డోజర్లను కూడా సిద్ధం చేశా.. ఎవరు అడ్డం వస్తారో రావాలని హెచ్చరించారు.
బల్డోజర్లు వస్తాయనే
తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని కొంతమంది చూస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. హైడ్రా అనగానే కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ బయటకు వచ్చారని.. పేదలు ఎవరైనా ఫామ్‌హౌస్‌లు కట్టుకోగలరా అని ప్రశ్నించారు. ఆక్రమణదారులే హైడ్రాను చూసి భయపడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మూసీ మురికిలో ఉన్న పేదలను ఆదుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వాళ్ల ఫామ్ హౌస్‌లపైకి బుల్డోజర్లు వస్తాయనే భయంతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

వారి ప్రయత్నాలు అందుకే
కేటీఆర్, హరీష్ రావులు తమ ఫామ్ హౌస్ లు కాపాడుకోవడానికి, పేదలను ముందు ఉంచుతున్నారని చెప్పుకొచ్చారు. మూసీ భాదితులకు తాము ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నా కూడా బీఆర్ఎస్ నేతలు సహించలేక పోతున్నారన్నారు. హరీష్ రావు చెప్పులు మోసే రకమని, తన ఇంటి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డ రోజులు మరచిపోయావా అంటూ హరీష్ రావును ఉద్దేశించి ప్రసంగించారు. మూసీ పునరుజ్జీవం కోసం తాము తాపత్రయ పడుతుంటే.. అడ్డుకొనేందుకు బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నం చేస్తుందన్నారు.
పేదల వైపే
అజీజ్ నగర్ లో హరీష్ రావు, జన్వాడ లో కేటీఆర్ ఫామ్ హౌస్ లు ఆక్రమణలకు పాల్పడి నిర్మించారని, వాటిపై నిజనిర్ధారణ కమిటీ వేస్తామన్నారు. పేదప్రజల పక్షపాతిగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. ఇటీవల ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని, నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించామన్నారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో విద్యాభివృద్దికై యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యూనివర్శిటీలు నిర్మిస్తున్నామన్నారు. తానెప్పుడూ పేదల వైపే ఉంటానని సీఎం రేవంత్ అన్నారు.












Click it and Unblock the Notifications