నన్ను ఐఎస్ఐ ఉగ్రవాదులుంటే జైల్లో పెట్టారు , కానీ - రేవంత్ ఉద్వేగం..!!

తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో తన అరెస్ట్ గురించి రేవంత్ సభలో ప్రస్తావించారు. తనను 16 రోజుల పాటు డిటెన్షన్ సెల్ లో ఉంచారని చెప్పుకొచ్చారు. కానీ, తాను ఏనాడు భయపడలేదని..పోరాటం కొనసాగించానని చెప్పుకొచ్చారు. తెలంగాణ గురించి ఏనాడు మాట్లాడకుండా త్యాగాల పునాదుల పైన కేసీఆర్ రాజకీయం చేసారని మండిపడ్డారు.

అక్రమ కేసులతో
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎంతో మందిపైన కేసులు పెట్టి జైలుకు పంపారని రేవంత్ ఆరోపించారు. రాజకీయ కక్ష్యతో తమను జైలుకు పంపారని చెప్పుకొచ్చారు. ఫాం హౌస్ లు కట్టుకుంది మీరు...జైలుకు పంపింది తమను అని పేర్కొన్నారు. తనను డిటెన్షన్ సెల్ లో పెట్టారని రేవంత్ గుర్తు చేసుకున్నారు. ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ జైలులో 16 రోజులు ఉంచారని..కానీ, తాను భయపడి లొంగిపోలేదన్నారు. నిలబడి పోరాటం చేసానని చెప్పారు.

CM Revanth Seriously reacts over BRS Leaders in Power disucssion in the Assembly

నాడు చేసిన పాపాలే
బీఆర్ఎస్ చేసిన పాపాలే వారిని వెంటాడాయన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో గుండు సున్నాకు కారణమైందన్నారు. తాను తెలుగుదేశంలో ఉన్నా...అసెంబ్లీ వేదికగా తెలంగాణ వాదన వినిపించానని గుర్తు చేసారు. కేసీఆర్ ఏనాడు పార్లమెంట్ లో తెలంగాణ గురించి ప్రస్తావన చేయలేదన్నారు. త్యాగాల పునాదుల పైన అధికారం దక్కించుకొని అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు విద్యుత్ అంశంలో ఖచ్చితంగా జైలుకు వెళ్తారని రేవంత్ హెచ్చరించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి.. మాజీ మంత్రి ఆవేదన చూస్తుంటే.. ఆల్రెడీ చర్లపల్లి జైలులో అన్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.

బయటకు నెట్టేసారు
విద్యుత్ కొనుగోళ్ల గురించి జగదీశ్వర్ రెడ్డి విచారణ అడిగితేనే తాము జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను నియమించటం జరిగిందన్నారు. మాజీ సీఎం అసెంబ్లీలో కట్టే పట్టుకొని విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటుంది అని చెప్పారని గుర్తుచేశారు. జైపాల్ రెడ్డి ఉత్పత్తి ప్రాతిపదికన కాకుండా.. వినియోగం ప్రాతిపదికన విభజన జరగాలని అలా అయితే తెలంగాణ ఇబ్బంది ఉండదు అని చెప్పారన్నారు. కేసీఆర్ ఎలా సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అని...తాను తెలుగు దేశంలో ఉన్నప్పుడు వాస్తవాలను వివరించడం జరిగిందన్నారు. మార్షల్‌తో తనను బయట పడేయించారని ఆనాటి విషయాలను గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+