రేవంత్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ - లిస్టులో ఉన్నదెవరు..!!

సీఎం రేవంత్ మంత్రివర్గ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం దక్కనుంది. పార్లమెంట్ ఎన్నికల తరువాత విస్తరణ దిశగా గతంలోనే పార్టీ అధినాయకత్వం అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ తాజా ఢిల్లీ పర్యటనలతో మంత్రివర్గంలో స్థానం కల్పించే వారి పేర్ల పైన ఆమోదం తీసుకోనున్నారు. విస్తరణకు ముహూర్తం ఖరారైంది. దీంతో, ఆశావాహులు మంత్రివర్గంలో స్థానం కోససం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.

విస్తరణ దిశగా
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు అడుగులు పడుతున్నాయి. కొత్తగా మరో ఆరుగురు అమాత్యులను నియమించేందుకు పార్టీ కసరత్తు జరుగుతోంది. తెలంగాణలో గతేడాది డిసెంబర్‌ 7న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్​రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టిలతో పాటు 11 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు. కీలకమైన హోం శాఖ, విద్యా శాఖ, మున్సిపల్‌, కార్మిక శాఖలు ముఖ్యమంత్రి వద్దనే ఉన్నాయి. జూలై 2న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తంగా ఖరారు చేసినట్లు సమాచారం.

CM Revanth to expand his cabinet with six ministers Muhutram fixed as reports

ఆరుగురికి ఛాన్స్
భర్తీ చేయాల్సిన ఆరు మంత్రి పదవుల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, రెండు బీసీలకు, ఒకటి లంబాడీకి, మరొకటి మైనారిటీకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కీలకమైన హోం శాఖను బోధన్‌ ఎమ్మెల్యే పి.సుదర్శన్​రెడ్డికి ఇవ్వాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి, ఏఐసీసీ హామీతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిలు కూడా మంత్రి పదవుల కోసం వేచి చూస్తున్నారు.

స్థానం దక్కేదెవరికి
ఆశావాహులు ఎవరికి వారు దిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేసుకుంటున్నారు. అయితే పోటీ పడుతున్న నలుగురు రెడ్డి సామాజికవర్గ నాయకుల్లో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది. మరో ఇద్దరిలో ఒకరికి డిప్యూటీ స్పీకర్‌, ఇంకొకరు ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా మక్తల్‌ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏదైనా కారణాలతో సుదర్శన్​రెడ్డికి మంత్రి పదవి దక్కకపోతే, ఎమ్మెల్సీ మహేశ్​కుమార్ గౌడ్​కు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+