అజారుద్దీన్ కు పదవీ గండం, కౌంట్ డౌన్ - రేవంత్ ప్లాన్ 'బీ'..!?
మంత్రి మహ్మద్ అజారుద్దీన్ కు పదవీ గండం వెంటాడుతోంది. మంత్రిగా అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవి ఆమోదానికి మరో పది రోజులే సమయం ఉంది. ఈ నెల 30వ తేదీ లోగా అజారుద్దీన్ ఎమ్మెల్సీగా నియామకం పూర్తి కావాలి. లేదంటే.. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో.. తాజాగా సీఎం రేవంత్ ఇదే అంశం పై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అజారుద్దీన్ మంత్రిగా కొనసాగటం పైన కొత్త చర్చ మొదలైంది.
రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ మంత్రి పదవి కొనసాగింపు పైన సస్పెన్స్ నెల కొంది. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆరు నెలల లోగా అజారుద్దీన్ చట్ట సభలకు ఎంపిక కావాల్సి ఉంది. ఈ గడువు ఈ నెల 30తో ముగియ నుంది. కాగా, అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవి ఆమోదం వ్యవహారం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. ఢిల్లీ పర్యటన వేళ అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఆమోదం అంశం పైన ఏఐసీసీ రేవంత్ కు కీలక సూచన లు చేసినట్లు తెలుస్తోంది. అజారుద్దీన్ మంత్రిగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో.. ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. గవర్నర్ కోటాలో ముద్దసాని కోదండరాంరెడ్డి, మహ్మద్ అజారుద్దీన్ పేర్లను సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే గవర్నర్‌కు పంపింది. ఈ ఇద్దరు పేర్లను ఆమోదించాల్సిందిగా రేవంత్‌రెడ్డి గవర్నర్‌ను అభ్యర్థించినట్టు తెలిసింది.

సీఎం రేవంత్ ప్లాన్ బీ..
ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిపై గత బీఆర్‌ఎస్ నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి . కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను మంత్రివర్గం సిఫార్సు చేసింది. దీన్ని బీఆర్‌ఎస్ నేతలు న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఇద్దరి ఎమ్మెల్సీ పదవులను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత మంత్రివర్గం అమీర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చి.. మళ్లీ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫార్సు చేసింది కానీ, విషయం న్యాయస్థానంలో ఉండటంతో వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కాగా, అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఏసీబీ కేసు నమోదైందని, మూడు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని గవర్నర్ కార్యాలయం గుర్తించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఫైల్‌ను న్యాయసమీక్షకు పంపరాని... న్యాయనిపుణుల సలహా మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక వేళ గవర్నర్ అజారుద్దీన్ విషయంలో నిర్ణయం పెండింగ్ లో ఉంచినా.. ప్రతికూల నిర్ణయం తీసుకున్నా.. అజారుద్దీన్ తో రాజీనామా చేయించి.. మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనే చర్చ పార్టీలో జరుగుతోంది.













Click it and Unblock the Notifications