మిస్‌ వరల్డ్‌ - 2025 పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఈవెంట్‌కు వేదిక కానుంది. మిస్ వరల్డ్ - 2025 అందాల పోటీని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు. అధికారులతో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వేంపల్లి నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సమీక్షలో మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి పలు అంశాలపై సీఎం సమీక్షించారు. ఈ మేరకు కార్యక్రమం కోసం తీసుకోవాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పట్టణ అభివృద్ధి సహా పలు అంశాలపై సమగ్రంగా చర్చ జరిపారు. ఈ పోటీల కోసం విదేశాల నుంచి వచ్చే కంటస్టెంట్స్, గ్లోబల్ అతిథులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేయాలని సీఎం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

cm-revanths-key-instructions-on-the-arrangements-for-the-miss-world-2025-competition

ఎయిర్‌పోర్ట్ నుంచి హోటళ్ల వరకూ ప్రత్యేక వీఐపీ వాహనాలు, వెల్కమ్ టీంలను ఏర్పాటు చేయాలని, గెస్ట్‌లు గమ్యం చేరే సమయానికి ప్రతి విషయాన్ని ప్రొఫెషనల్‌గా నిర్వహించాలని సూచించారు.
అంతే కాకుండా పోటీలలో పాల్గొనేవారికి తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసే విధంగా హోటళ్లలో 'వెల్కమ్ కిట్స్', స్పెషల్ మెనూలు, పర్సనలైజ్డ్ హాస్పిటాలిటీని అందించాలన్నారు. మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు హోటళ్ల వద్ద ప్రత్యేక భద్రతా బలగాలు, మహిళా పోలీస్‌లు అందుబాటులో ఉండాలని సూచించారు.

ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ప్రణాళికలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. పోలీస్ శాఖ అధినేతలతో సమన్వయంతో సీసీటీవీలు, ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగించాలన్నారు. మరోవైపు తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అంతే కాకుండా ఈవెంట్‌కు ముందే నగరంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, లైటింగ్, గ్రీన్‌రీ, హోర్డింగ్‌లు, వాల్ ఆర్ట్‌లను పూర్తి చేయాలని GHMC, HMDA అధికారులకు స్పష్టమైన డెడ్‌లైన్ ఇచ్చారు. మిస్ వరల్డ్ సందర్శించే ప్రాంతాలను ప్రత్యేకంగా మేకోవర్ చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ మీడియా కవరేజ్ ను సైతం దృష్టిలో ఉంచుకుని స్పెషల్ ప్రెస్ ఏరియాలు, హైస్పీడ్ ఇంటర్నెట్ హబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అతిథులకు భాషా సమస్యలు తలెత్తకుండా ట్రాన్స్‌లేటర్స్, ఇంటర్‌ప్రెటర్స్‌ను నియమించాలన్నారు. ఈవెంట్‌ను సోషల్ మీడియా ద్వారా గ్లోబల్ ప్రమోట్ చేయాలని కమ్యూనికేషన్స్ శాఖకు టాస్క్ అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+