13 నుంచి మూడు దేశాల్లో పర్యటించనున్న సీఎం రేవంత్ టీమ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి నెలలో మూడు దేశాలను చుట్టేయనున్నారు. డిసెంబర్ 13 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీని పరిశీలించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ తోపాటు ప్రభుత్వ సలహాదారుడు జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, స్పోర్ట్స్ ఎండీ సోని బా, స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేన రెడ్డి వెళ్లనున్నారు. ఈ బృందం డిసెంబర్ 13వ తేదీ రాత్రి సీఎం రేవంత్ బృందం ఆస్ట్రేలియా బయల్దేరుతుంది. డిసెంబర్ 14, 15, 16, 17 నాలుగు రోజులపాటు ఆస్ట్రేలియాలో సీఎం టీమ్ పర్యటించనుంది. క్వీన్స్‌ల్యాండ్ విశ్వవిద్యాలయాన్ని పరిశీలించిన తర్వాత సింగపూర్ వెళ్లనుంది.

సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ టీం.. షాపింగ్ మాల్స్, క్రీడా ప్రాంగణాలను పరిశీలిస్తుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత సింగపూర్‌లో జరగనున్న పారిశ్రామికవేత్తల సామవేశంలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొంటారని తెలుస్తోంది. ఇక, డిసెంబర్ 19వ తేదీన సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్ వెళ్లనున్నారు.
దావోస్‌లో డిసెంబర్ 20 నుంచి 24వ తేదీ వరకు ఐదు రోజులపాటు జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు మూడు రోజులపాటు పాల్గొననున్నారు. 2024లో దావోస్ పర్యట సందర్భంగా సుమారు రూ. 40 వేల కోట్లకుపైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో డీల్ చేసుకుంది. ప్రస్తుత పర్యటనలో రాష్ట్రానికి అంతకుమించి పెట్టుబడులు రాబట్టేందుకు సీఎం రేవంత్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
-
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !!












Click it and Unblock the Notifications