కేసీఆర్ కు జీతం కట్ పై నిర్ణయం: సీఎం రేవంత్
అసెంబీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 1, 2023 నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ 1 కోటి 6 లక్షల 56 వేల 674 రూపాయలు జీతభత్యాలు పొందారని అన్నారు. విధులకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని, వస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.
"అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారని అనుకున్నాం. కొత్త గవర్నర్ కు శుభాకాంక్షలు చెబుతారని భావించాం. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదు. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా... కొందరిలో రాచరిక పోకడలు మాత్రం పోలేదు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకుంటున్నారు" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
"కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారు. ప్రజలే తప్పు చేశారని అనుకుంటున్నారు. నియంత పోకడలను అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి ప్రదర్శించారు. ప్రజలు బుద్ధిచెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఇప్పుడూ అదే తీరుగా ప్రవర్తిస్తున్నారు" అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
"తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిభింబిస్తూ, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్ ను ఆవిష్కరిస్తూ... రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం చరిత్రాత్మకం. ఆయన చేసిన ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు. తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం ఎదగడానికి అవసరమైన విశిష్ఠ ప్రణాళిక. అటువంటి గొప్ప సంకల్పాన్ని, పవిత్ర శాసన సభ వేదిక నుండి రాష్ట్ర ప్రజల ముందు ఉంచిన గవర్నర్ శుక్లా గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"గత చరిత్రను అనుభవాలుగా మార్చుకుంటూ భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవాలని గవర్నర్ ప్రసంగంలో వివరించారు.సంక్షోభ సమయంలో దేశ ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు చేపట్టారు. ఆయన తీసుకున్న ప్రణాళికలతోనే ఇవాళ దేశం ఈ పరిస్థితుల్లో ఉంది. మొదటి తరంలో నెహ్రూ- ఇందిరా గాంధీ గొప్ప విధానాలు తీసుకువచ్చారు. సరళీకృత విధానాలతో దేశ ఆర్ధిక గతిని మార్చిన ఘనత పీవీ నరసింహారావుది. 1990 నుంచి 2020 వరకు 30 ఏండ్లు పీవీ నుంచి మన్మోహన్ సింగ్ వరకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
"భవిష్యత్ లో AI సునామీ రాబోతుంది. దీనిని ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించిన ఒక పాలసీ డాక్యుమెంట్ ను గవర్నర్ గారి ప్రసంగంలో వివరించారు. ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను కనీసం చదివారా? చూశారా..? గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించకపోతే తరువాతి తరాలు మనల్ని క్షమించవు. ఇది నవశకానికి నాంది పలుకాల్సిన సమయం. అధికారం కోల్పోయామన్న దుఃఖమే తప్ప ప్రభుత్వానికి సహకరించాలన్న ప్రధాన ప్రతిపక్షానికి ఆలోచన లేదు" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
"అందుకే ఎవరు అడ్డుపడ్డా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. అన్ని రంగాల మేధావులతో సమన్వయం చేసుకుని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించుకున్నాం. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ గా విభజించుకున్నాం. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా కొట్టిపారేయాలని మాట్లాడారు. అప్పుడు సక్రమం అని చెప్పిన వాళ్లకు ఇప్పుడు అక్రమం ఎలా అయింది?మీరు మాట్లాడిన మాటలను ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకున్నారా? మూసీ ఉప్పల్ భగాయత్ లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూసొద్దాం రండి. ఎవరెవరు ఎక్కడ ఆక్రమించుకున్నారో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం.." అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

"కాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి పన్ను మినహాయించాం. త్వరలో క్యూర్ పరిధిలోని ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నాం. మన నగరాన్ని మనం పరిరక్షించుకోకపోతే, చెరువులను పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరం మనల్ని క్షమించదు" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications