Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంపేస్తారని బెదిరింపు- ఎంపీ కోమటిరెడ్డిపై కేసు..!?

తన తండ్రి చెరుకు సుధాకర్‌ను హత్య చేస్తానని బెదిరించారని ఎంపీ వెంకటరెడ్డిపై చెరుకు సుహాస్ పోలీసులకు ఫిర్యాదు

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పైన కేసు నమోదలైంది. తనను, తన తండ్రి చెరుకు సుధాకర్‌ను హత్య చేస్తానని బెదిరించారని వెంకటరెడ్డిపై నల్లగొండకు చెందిన చెరుకు సుహాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను తన అభిమానులు చంపేస్తారంటూ ఆయన కుమారుడికి ఫోన్‌లో వార్నింగ్‌ ఇచ్చారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన మాట్లాడిన ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వెంకట్‌రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, తమకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని సుహాస్ కోరారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ కుమారుడికి ఫోన్ చేసి బెదిరించారంటూ కేసు నమోదైంది. చెరుకు సుధాకర్ తనయుడు సుహాస్ కు ఫోన్ చేసి మీ నాన్న నా గురించి టీవీ చానెల్‌తో ఎక్కువ మాట్లాడుతున్నాడు. వాడ్ని చంపడానికి 100 వాహనాల్లో నా మనుషులు తిరుగుతున్నారు. నీ నవ్య హాస్పిటల్ కూడా కూల్చేస్తారు. నిన్ను(సుహాస్) సైతం చంపుతానని బెదిరించారు. వారంలో మీ నాన్న సుధాకర్‌ను చంపివేస్తారని వార్నింగ్ ఇచ్చారని చెరకు సుహాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. లక్షల మందిని నేను బతికించిన. వానికెంత ధైర్యం. నిన్న, మొన్న పార్టీలోకి వచ్చిండు. వాడిని వదిలిపెట్టను. నీకు చెప్తున్నా. వార్నింగ్‌ ఇస్తున్నా. నా పేరు తీసుకుని మొన్న స్టేట్‌మెంట్‌ ఇచ్చిండు. మావాళ్లు మొన్నటిదాకా ఓపిక పట్టారు. ఇగ మా వల్ల కాదు సార్‌ అంటున్నారు. మేం బయటికి ఎల్లినం. ఆడు యాడదొరికితే ఆడ చంపేస్తామంటున్నరు అంటూ మాట్లాడిన ఆడియో వైరల్ అయింది.

Cogress leader Cheruku Sudhakar son Suhas comaplained against MP Komatireddy Venkata Reddy

ఎంత ధైర్యం వానికి.. నిన్న మొన్న పార్టీలోకి వచ్చి.. ఇప్పుడు నా మీదనే మాట్లాడుతుండు. ఇక వదిలిపెట్టరు నా మనుషులు వాన్ని. వార్నింగ్ ఇస్తున్నా.. వారం రోజుల్లో వాన్ని చంపేస్తారు. వాడు క్షమాపణ చెప్పకపోతే మాత్రం చంపేస్తారు..అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆడియో ఆధారంగాసుహాస్ ఫిర్యాదు చేసారు. దీని పైన చెరుకు సుధాకర్ స్పందించారు. ఎంపీ కోమటిరెడ్డి మతి ఉండి మాట్లాడాడో, మతిలేక మాట్లాడాడో అర్థం కావడం లేదని అన్నారు. తన కుమారుడికి ఫోన్‌ చేసి తిట్టడడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ విషయాన్ని తాను సీరియ్‌సగా తీసుకుంటానని చెప్పారు. తాను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా, ఆయన స్టార్‌ క్యాంపెయినర్‌గా పని చేస్తున్నారని, తనపై ఆ భాష ఏంటని ప్రశ్నించారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ కామెంట్‌ చేయలేదన్నారు. పార్టీ శ్రేణుల్లో, రాష్ట్ర ప్రజల దృష్టిలో వెంకట్‌రెడ్డి డకౌట్‌ అయిన వికెట్‌ అన్నారు. తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వెంకట్‌రెడ్డిపై అధిష్ఠాన మే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+