అర్ధరాత్రి కలెక్టర్ పర్యటన: బైక్‌పై ఇల్లిళ్లూ తిరిగారు, ఎందుకంటే..?

ఆదివారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి భూపాలపల్లి పట్టణ కేంద్రంలో బైక్ చెక్కర్లు కొట్టారు. వివిధ వార్డుల అభివృద్ధి ఏ విధంగా ఉందో పరిశీలించారు. ఈ పర్యటన ఆదివారం రాత్రి 10.30 నుంచి అర్ధరాత్రి

జయశంకర్‌ భూపాలపల్లి: ఆదివారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి భూపాలపల్లి పట్టణ కేంద్రంలో బైక్ చెక్కర్లు కొట్టారు. వివిధ వార్డుల అభివృద్ధి ఏ విధంగా ఉందో పరిశీలించారు. ఈ పర్యటన ఆదివారం రాత్రి 10.30 నుంచి అర్ధరాత్రి 2.30 వరకు కొనసాగింది.

హనుమాన్‌నగర్‌, శాంతినగర్‌, ఎస్సీకాలనీ, సుభాష్‌ కాలనీ, జంగేడు, శెగ్గంపల్లి, గడ్డిగానిపల్లి, కాసీంపల్లి, కారల్‌మార్క్స్‌ కాలనీ, కృష్ణాకాలనీ, అంబేద్కర్‌ చౌరస్తాలో అంతర్గత రహదారుల నాణ్యతను, మురుగు కాలువల స్థితిగతులను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

collector Murali bike riding in jayashankar bhupalpally town

వివిధ వార్డుల్లో అంతర్గత రహదారులు, మురుగు కాల్వలను పరిశీలించడమే కాకుండా వివిధ దుకాణాలు ఎప్పటి వరకు తెరచి ఉంటున్నాయని తెలుసుకున్నారు. అలాగే, గుడుంబా తయారీ, రవాణాకు సంబంధించిన సమాచారం గురించి ఆరా తీశారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే అధికారులకు సమాచారం అందజేయాలని స్థానికులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+