‘నారాయణ’ అంతే!: స్కూల్ విద్యార్థుల చేతిలో కాలేజీ పుస్తకాలు!, ఎంఈఓ షాక్

హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్‌లో గల ఓ కార్పొరేట్ పాఠశాల(నారాయణ టెక్నో స్కూల్)కు ఆ మండల విద్యాశాఖాధికారి యాధృచ్చికంగా ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. కాగా, ఆ పాఠశాలలోని తొమ్మిది, పదో తరగతి విద్యార్ధుల చేతుల్ల

హైదరాబాద్: ఇటీవల కాలంలో జరుగుతున్న కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇందుకు కారణం వారిపైన తీవ్రమైన ఒత్తిడి పెట్టడమే. ఇందుకు ఉదాహరణగా నగరంలోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో జరిగిన ఈ ఘటనను చెప్పుకోవచ్చు.

వివరాల్లోకి వెళితే.. ఎల్బీనగర్‌లో గల ఓ కార్పొరేట్ పాఠశాల(నారాయణ టెక్నో స్కూల్)కు ఆ మండల విద్యాశాఖాధికారి యాధృచ్చికంగా ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. కాగా, ఆ పాఠశాలలోని తొమ్మిది, పదో తరగతి విద్యార్ధుల చేతుల్లో ఏకంగా ఇంటర్మీడియట్ పుస్తకాలు దర్శనమివడంతో ఎంఈవో ఆశ్చర్యానికి లోనయ్యారు.

college books are at hands of school students

వెంటనే ఆయన పాఠశాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చేశారు. అయితే, ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సదరు పాఠశాలపై చర్యలు తీసుకునే అధికారం విద్యాశాఖాధికారులకు ఉన్నా... కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలనుఅధికారులు సైతం ఏమీచేయలేక పోతున్నారని వాపోతున్నారు.

కాగా, ఇటీవల మేడేపల్లికి చెందిన ఓ విద్యార్ధిని బహిరంగంగా 'ఆ కళాశాలను మూసివేయండి' అంటూ ఓ లేఖను రాసి అదృశ్యమైన సంఘటన తెలిసిందే. ఈ లేఖ ద్వారా విద్యార్ధులపై పాఠశాలలు, కళాశాలలు ఎంత ఒత్తిడి తెస్తున్నాయన్న విషయం బహిర్గతమైంది. తీవ్రమైన చదువు ఒత్తిడితో ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+