కలరోథాన్: ఆకట్టుకున్న రంగుల చిత్రాలు(పిక్చర్స్)
హైదరాబాద్: 5వ యూత్ డెల్ఫిక్ గేమ్స్‌లో భాగంగా డెల్ఫిక్ గేమ్స్, బ్రీత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థతో కలిసి డెల్ఫిక్ గేమ్స్ ఆర్ట్ వాల్ స్ఫూర్తితో కలరోథాన్ 6వ ఎడిషన్‌ను నగరంలో నిర్వహించారు. ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమం ఐదు రోజులపాటు జరగనుంది. ఔత్సాహికులు అధిక సంఖ్యలో పాల్గొని చక్కటి చిత్రాలను గోడలపై చిత్రీకరించారు.
ఈ కార్యక్రమంలో 10వేల మందికిపైగా పిల్లలు ఉత్సాహంగా పాల్గొని 164 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన విశాలమైన గోడపై అద్భుతమైన చిత్రాలను చిత్రీకరించారు. డెల్ఫిక్ గేమ్స్, 2016 ఫిబ్రవరిలో నిర్వహించబోయే ఇంటర్నేషనల్ యూత్ డెల్ఫిక్ గేమ్స్‌లో పాల్గొనే విధంగా ఔత్సాహికులకు కోసం నమోదు చేసుకునే అవకాశాన్ని అందించింది.
ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతల బృందం 250 అత్యుత్తమ పెయింటింగ్‌లను ఎంపిక చేసి, తర్వాత మై ఛాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకటించడం జరుగుతుంది. ఈ సందర్భంగా యూత్ డెల్ఫిక్ గేమ్స్ ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్ సెక్రటరీ ప్రణవ్ పింగిల్ రెడ్డి మాట్లాడుతూ.. కళలు, సాంస్కృతులు అన్ని వయస్సుల వారిలోని ప్రతిభ నైపుణ్యాలు తెలియజేస్తాయన్నారు.
కళాకారుల నైపుణ్యాలను వెలికితీసే విధంగా కలరోథాన్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రానున్న రోజులలో మరో 5 నగరాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా డెల్ఫిక్ గేమ్స్ అతిపెద్ద ఆర్ట్ వాల్ పెయింటింగ్‌ను నిర్వహించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాలనే ఆలోచనలో ఉందని నిర్వాహకులు తెలిపారు.

కలరోథాన్
5వ యూత్ డెల్ఫిక్ గేమ్స్‌లో భాగంగా డెల్ఫిక్ గేమ్స్, బ్రీత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థతో కలిసి డెల్ఫిక్ గేమ్స్ ఆర్ట్ వాల్ స్ఫూర్తితో కలరోథాన్ 6వ ఎడిషన్‌ను నగరంలో నిర్వహించారు.

కలరోథాన్
ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమం ఐదు రోజులపాటు జరగనుంది. ఔత్సాహికులు అధిక సంఖ్యలో పాల్గొని చక్కటి చిత్రాలను గోడలపై చిత్రీకరించారు.

కలరోథాన్
ఈ కార్యక్రమంలో 10వేల మందికిపైగా పిల్లలు ఉత్సాహంగా పాల్గొని 164 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన విశాలమైన గోడపై అద్భుతమైన చిత్రాలను చిత్రీకరించారు.

కలరోథాన్
డెల్ఫిక్ గేమ్స్, 2016 ఫిబ్రవరిలో నిర్వహించబోయే ఇంటర్నేషనల్ యూత్ డెల్ఫిక్ గేమ్స్‌లో పాల్గొనే విధంగా ఔత్సాహికులకు కోసం నమోదు చేసుకునే అవకాశాన్ని అందించింది.

కలరోథాన్
ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతల బృందం 250 అత్యుత్తమ పెయింటింగ్‌లను ఎంపిక చేసి, తర్వాత మై ఛాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకటించడం జరుగుతుంది.

కలరోథాన్
ఈ సందర్భంగా యూత్ డెల్ఫిక్ గేమ్స్ ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్ సెక్రటరీ ప్రణవ్ పింగిల్ రెడ్డి మాట్లాడుతూ.. కళలు, సాంస్కృతులు అన్ని వయస్సుల వారిలోని ప్రతిభ నైపుణ్యాలు తెలియజేస్తాయన్నారు.

కలరోథాన్
కళాకారుల నైపుణ్యాలను వెలికితీసే విధంగా కలరోథాన్ నిర్వహించడం జరిగిందని చెప్పారు.

కలరోథాన్
ఈ కార్యక్రమాన్ని రానున్న రోజులలో మరో 5 నగరాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

కలరోథాన్
ఈ కార్యక్రమం ద్వారా డెల్ఫిక్ గేమ్స్ అతిపెద్ద ఆర్ట్ వాల్ పెయింటింగ్‌ను నిర్వహించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాలనే ఆలోచనలో ఉందని నిర్వాహకులు తెలిపారు.

కలరోథాన్
ఈ సందర్భంగా యూత్ డెల్ఫిక్ గేమ్స్ ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్ సెక్రటరీ ప్రణవ్ పింగిల్ రెడ్డి మాట్లాడుతూ.. కళలు, సాంస్కృతులు అన్ని వయస్సుల వారిలోని ప్రతిభ నైపుణ్యాలు తెలియజేస్తాయన్నారు.












Click it and Unblock the Notifications