Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరంగల్ లోకసభ ఉప ఎన్నిక: ప్రచారానికి తెర, ఎల్లుండి పోలింగ్

వరంగల్ : వరంగల్ పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి గురువారం సాయంత్రంతో తెరపడింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఐదు ప్రధాన పార్టీల అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నుంచి పసునూరి దయాకర్, కాంగ్రెసు నుంచి సర్వే సత్యనారాయణ, బిజెపి - టిడిపి కూటమి నుంచి దేవయ్య, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి నల్లా సూర్యప్రకాష్ పోటీలో ఉన్నారు. వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్ కుమార్ పోటీలో ఉన్నారు.

గురువారం సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీలు ప్రచారం ముగించాయి. లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీల ఎన్నికల ప్రచారం కొనసాగింది. రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. వరంగల్ లోకసభ స్థానంలో 1,778 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలో బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. 15 లక్షల 9 వేల 671 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Compaign end for Warangal lok Sabha seat

ఈసీ నిబంధనల ప్రకారం అన్ని పార్టీలు నడుచ్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కోరారు. పోలింగ్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐదు గంటల తర్వాత ఇతర వ్యక్తులెవ్వరూ వరంగల్ లోక్‌సభ పరిధిలో ఉండరాదన్నారు. ఓటరుగా ఉన్న రాజకీయ నేతలు ఇంట్లోనే ఉండాలన్నారు. పార్టీలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగవద్దని కోరారు.

ఓటర్లందరికీ ఇంటింటికీ తిరిగి బూత్ స్లిప్‌లు అందించామని, 94 శాతం పంపిణీ పూర్తయిందన్నారు. ఓటేసేందుకు వెళ్లినప్పుడు ఏదైనా గుర్తింపు కార్డు తప్పకుండా తీసుకెళ్లాలన్నారు. బందోబస్తుకు 20 కంపెనీల పారా మిలటరీ, సెంట్రల్ ఫోర్స్‌ను రంగంలోకి దింపామన్నారు.

ఇప్పటి వరకు తనిఖీల్లో రూ.2 కోట్లు పట్టుకున్నామని తెలిపారు. మీడియాలో పార్టీలు ఎలాంటి ప్రకటనలు ఇవ్వవద్దని, పెద్దసంఖ్యలో ఎస్‌ఎంఎస్ పంపవద్దని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై 1800425227247 అనే టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి చెప్పొచ్చన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+