బీసీ కుల గణనకు సీఎం రేవంత్ రెడ్డి డెడ్‌లైన్: ఆ తర్వాతే ఎన్నికలు
బీసీ కుల గణనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు, బీసీ కులగణన పూర్తి చేయడానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో ఎలాంటి చిక్కులు తలెత్తకుండా ఏక సభ్య న్యాయ కమిషన్ ద్వారా వచ్చే 60 రోజుల్లోగా సమగ్ర అధ్యయనం పూర్తి చేయించాలని చెప్పారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ కులగణన అంశాలపై మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ సీతక్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.

మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు తక్షణం హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్‌ను నియమించాలని, అంతేకాకుండా 24 గంటల్లోగా కమిషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. నిర్దేశించిన రెండు నెలల గడువులోగా కమిషన్ తన రిపోర్టు సమర్పించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.
2011 తర్వాత జన గణన జరగని కారణంగా 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా అధ్యయనం జరగాలి. క్షేత్రస్థాయి విజ్ఞాపనలు, ఫిర్యాదుల కోసం కమిషన్ జిల్లాల్లో పర్యటించాలి. ఏకసభ్య న్యాయ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
బీసీ కమిషన్‌కు తక్షణం అవసరమైన యంత్రాంగం సమకూర్చాలి. 60 రోజుల్లోగా సామాజిక, ఆర్థిక సర్వే పూర్తి చేసి డిసెంబరు 9 లోపు నివేదిక సమర్పించాలి. ఈ సర్వే పూర్తయితే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications