రంగనాథ్‌ది ఆత్మహత్యే: వంటగదిలో destiny అని రాసి ఉంది, ఒంటరితనం భరించలేకే...

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఒంటరితనం భరించలేకనే తన తండ్రి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆయన కూతురు చెప్పారు. వంటగదిలో destiny అని రాసి ఉంది. దాన్ని బట్టి కూడా రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.

తలుపులు పగులగొట్టి రంగనాథ్‌ను స్థానికులు ఆస్పత్రికి చేర్చారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. 2009లో రంగనాథ్ భార్య మరణించింది. అప్పటి నుంచి ఆయన మానసికంగా క్రుంగిపోయారు. సినిమాలు లేకపోవడంతో ఆయన మనోవేదనకు గురైనట్లు చెబుతున్నారు.

Confirmed: Ranganath commited suicide

శనివారంనాడు ఆయన ఓ సన్మాన కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. అయితే తాను రాలేనని నిర్వాహకులకు ఎస్ఎంఎస్ మెసేజ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. రంగనాథ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

కుటుంబ కథా చిత్రాల్లో నటించిన రంగనాథ్ మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందారు. గంభీరమైన గొంతు, ఠీవీ, ఎత్తయిన విగ్రహం ఆయన అందాల కథానాయకుడిగా నిలబెట్టాయి. రంగనాథ్ మృతికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+