రంగారెడ్డిXహైదరాబాద్: దానంపై కోడిగుడ్లు, టమోటలతో సొంత పార్టీ దాడి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ పైన దాడికి సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సమయంలో కొందరు కార్యకర్తలు దానం పైన దాడికి యత్నించడంతో రసాభాసగా మారింది.

సోమవారం నాడు అంతటా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉప్పల్‌లోను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు గ్రేటర్ అధ్యక్షులు దానం నాగేందర్ హాజరయ్యారు. ఈ సమయంలో దానం కేవలం హైదరాబాదుకే అధ్యక్షుడని, రంగారెడ్డి జిల్లాకు కాదని కొందరు కార్యకర్తలు నినాదాలు చేశారు.

Congress activists attack Danam Nagender with eggs

ఆయనకు రంగారెడ్డి జిల్లా పైన హక్కు లేదని నినదించారు. రంగారెడ్డి జిల్లా కార్యక్రమాల్లో ఆయన పాల్గొనవద్దని చెప్పారు. ఈ వేడుకలకు గ్రేటర్ అధ్యక్షుడు దానం నాగేందర్‌తో పాటు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ హాజరయ్యారు.

కార్యక్రమంలో పరస్పరం దాడికి ప్రయత్నం జరిగింది. రంగారెడ్డి - హైదరాబాద్ జిల్లాల కార్యకర్తలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నారు. దాడులు చేసుకున్నారు. కొందరు కార్యకర్తలు దానం తదితరుల పైన కోడిగుడ్లు, టమోటాలు విసిరేశారు. దీంతో కార్యక్రమం రసాభాసగా మారింది.

దానం నాగేందర్ వివరణ

ఉప్పల్‌లో జరిగిన ఘటన పైన దానం నాగేందర్ స్పందించారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జెండాను ఎగురవేసి ఉంటే, ఆ తర్వాత తాను వెళ్లి ఎగురవేయడం తప్పే అవుతుందన్నారు. అయితే తాను వెళ్లేసరికి జెండా సగంలో ఉందని, కాబట్టి తాను ఎగురవేసే ప్రయత్నం చేశానన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధి తేలాల్సి ఉందన్నారు. రంగారెడ్డి - హైదరాబాద్ రగడ కాంగ్రెస్ పార్టీకి చిక్కే అన్నారు. గ్రేటర్ హద్దులు తేలాల్సి ఉందని చెప్పారు. ఉప్పల్‌లో తోపులాట జరిగింది వాస్తవమేనని, నేను సర్ది చెప్పానని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+