Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ..!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం 13 స్థానాలకు కాంగ్రెస్ 9 స్థానాల్లో ముందంజలో ఉండగా.. బీఆర్ఎస్ 3, బీజేపీ 2 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. పెద్దపల్లిలో విజయరామణరావు ముందంజలో ఉండగా.. వేములవాడలో ఆది శ్రీనివాస్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోన్నారు. మానకొండూరులో కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ లీడ్ లో ఉన్నారు.
హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ ముందంజలో ఉన్నారు. జగిత్యాలో జీవన్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మంథనిలో శ్రీధర్ బాబు ఆధిక్యంలో ఉన్నారు. రామగుండంలో మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ముందంజలో ఉన్నారు. హుజురాబాద్ లో ఈటల, కరీంనగర్ లో గంగుల, సిరిసిల్లలో కేటీఆర్ ఆధిక్యంలో ఉన్నారు.













Click it and Unblock the Notifications