ముగిసిన తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు: 18 వేల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న
తెలంగాణ రాష్ట్రంలో మే 27న జరిగిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గురువారం తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 తొలి ప్రాధాన్యత ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కుమార్‌కు 29,697 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో అభ్యర్థి గెలుపునకు 1,55,095 ఓట్లు కావాలి. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో మొత్తంగా 3,10,189 ఓట్లు పోల్‌కాగా, 25,824 ఇన్‌వ్యాలిడ్ ఓట్లు నమోదయ్యాయి. అయితే, ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్‌పై తప్పుల తడకగా జరుగుతుందంటూ బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్న ఆరోపణలపై ఆర్వో హరిచందన స్పందించారు. కౌంటింగ్ తీరుపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

ఏమైనా అనుమానాలు ఉంటే సిబ్బంది నివృత్తి చేస్తారని ఆర్వో హరిచందన సూచించారు. కాగా, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపించారు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండానే లీడ్ ప్రకటించారన్నారు. సందేహాలను నివృత్తి చేయకుండా ఆర్వోలు ఏకపక్షంగా వ్యవహరించారని, అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదని మండిపడ్డారు.
ఇదేంటని అడిగితే పోలీసులు బయటకు నెట్టారని రాకేశ్ రెడ్డి చెప్పారు. ఓట్ల లెక్కింపు ఏకపక్షంగా జరుగుతోందని విమర్శించారు. సుమారు వెయ్యి ఓట్లు గోల్‌మాల్ అయ్యాయని ఆక్షేపించారు. ఎన్నికల సంఘం స్పందించి వెయ్యి ఓట్లతో పాటు ప్రతీ టేబుల్ దగ్గర ఓట్లలో ఉన్న అభ్యంతరాలు తీర్చాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఖండించారు. అధికారుల పనితీరుపై బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications