హరీష్ రావు ఓ బచ్చా: అలీ, నానక్‌రాంగూడలో కూలిన బిల్డింగ్.. కేటీఆర్‌కు చిక్కు!
తెలంగాణ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావుల పైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీలు శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావుల పైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీలు శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హరీష్ రావు రాజకీయాల్లో ఓ బచ్చా అని షబ్బీర్ అన్నారు.
సాగునీటి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని చెప్పారు. భవనం కూలిన ఘటనపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భవనాలు కూలిన ఘటనల్లో అధికారులను సస్పెండ్ చేసి, నాలుగు రోజుల తర్వాత మళ్లీ పోస్టింగ్‌లు ఇస్తున్నారని ఆరోపించారు.

రెండున్నరేళ్లలో తెరాస ఇచ్చిన హామీలలో పది కూడా అమలు కాలేదన్నారు. హామీల అమలుపై ప్రభుత్వం చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సమయం, వేదిక మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరేనని సవాల్ చేశారు.
కేటీఆర్ రాజీనామా చేయాలి
హైదరాబాదులోని నానక్‌రాంగూడలో భవనం కూలిన ఘటనలో నైతికబాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications