కొండా సురేఖ స్థానంలో మంత్రిగా ఆ మహిళా నేత, హైకమాండ్ బిగ్ ట్విస్ట్..!?

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు హైకమాండ్ కు చేరింది. సీఎం రేవంత్ పైన వ్యాఖ్యల తరువాత సురేఖతో పాటుగా చిన్నా రెడ్డి పైన కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే ప్రతికూల సంకేతాలు వెళ్తాయని ఢిల్లీ నేతలు భావించి.. పార్టీ విధానాలకు అనుగుణంగా తుది నిర్ణయానికి సిద్దమయ్యారు. ఇదే సమయంలో కొండా సురేఖ పైన వేటు వేస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలో ఒక నిర్ణయానికి వచ్చారు. మహిళా నేత వైపు ఏఐసీసీ ఆసక్తిగా ఉందని సమాచారం.

కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్ లో.. ప్రభుత్వంలో సంచలనంగా మారింది. కొండా సురేఖ నేరుగా పార్టీ చీఫ్ ను కలిసి పరిస్థితిని వివరించారు. అయితే, తరచూ వివాదాలతో సమస్యగా మారు తున్న సురేఖ ను తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధికారిక ఆమోదం తరువాత నిర్ణయం వెల్లడించనున్నారు. అదే విధంగా చిన్నారెడ్డి పైనా చర్యలు ఖాయమని పార్టీ నేతల సమాచారం. కాగా.. సురేఖ ను తప్పిస్తే ఆ స్థానంలో బీసీ వర్గానికే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ తన ఛాయిస్ గా విప్ ఆది శ్రీనివాస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తే పార్టీకి కట్టుబడి ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు. అయితే, పార్టీ హైకమాండ్ మాత్రం మహిళా మంత్రిని తప్పిస్తే.. మరో మహిళతో భర్తీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇద్దరి పేర్లు పరిశీలన చేస్తోంది.

 మోదీ కేబినెట్ లోకి మరో టీడీపీ ఎంపీ, ఆయనకే ఫిక్స్ - తెలంగాణ నుంచి ఆ ఇద్దరూ..!?
మోదీ కేబినెట్ లోకి మరో టీడీపీ ఎంపీ, ఆయనకే ఫిక్స్ - తెలంగాణ నుంచి ఆ ఇద్దరూ..!?
congress-eyes-woman-replacement-for-konda-surekha-two-names-under-consideration-here-the-report

హైకమాండ్ నిర్ణయం పై ఉత్కంఠ

సురేఖను తప్పిస్తే.. ఆ సీటు బీసీ వర్గానికి చెందిన హైదరాబాద్ మాజీ మేయర్, కేకే కుమార్తె విజయ లక్ష్మీ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలో గ్రేటర్ ఎన్నికలు సైతం జరగనుండటంతో ఇక్కడి నుంచి బీసీ వర్గానికి చెందిన విజయలక్ష్మీకి కేటాయించి.. త్వరలో జరిగే వరంగల్ ఎమ్మెల్సీ బరిలో నిలపాలనే ఆలోచనతో ఉన్నారు. కాగా.. ఇదే సమయంలో విజయశాంతి ఢిల్లీ కేంద్రంగా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. వరంగల్ జిల్లా మూలాలు కలిగిన విజయశాంతి తనకు అవకాశం ఇస్తే.. తన సామర్ధ్యం రుజువు చేసుకుంటానని చెబుతున్నారు. కాంగ్రెస్ లో చేరిక సమయంలోనూ తనకు హామీ ఇచ్చిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా అటు ప్రభుత్వం.. ఇటు పార్టీకి బలమైన వాయిస్ గా నిలుస్తారని భావిస్తున్నారు. దీంతో.. రాములమ్మకు మంత్రి పదవి దాదాపు ఖాయమని చెబుతున్నారు. ఇక, ఈ అంచనాల వేళ హైకమాండ్ ఎవరికి అవకాశం ఇస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+