వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలుపొందిన అభ్యర్థులకు ప్రలోభాలు..! టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలోని రాజకీయ పార్టీల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ప్రధానంగా అధికార గులాబీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మద్య వివాదాన్ని రగిలిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను తమ వైపు తిప్పుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శిస్తోంది.

మున్సిపల్ ఎన్నికల్లో సంపూర్ణ ఆదిపత్యం సాధించినప్పటికి ప్రతిపక్ష పార్టీల మనుగడను ప్రశ్నార్ధకం చేయాలని అధికార గులాబీ పార్టీ కుటిల ప్రయత్నాలు చేస్తోంది ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. మరికొన్ని చోట్ల అధిపార్టీ అభ్యర్థులకు నామమాత్రపు ఓట్లు పోలైనప్పటికి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అదనపు మెజారిటిని కట్టబెట్టి ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసారని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి ద్వజమెత్తారు.

Congress firing on TRS party..!

తెలంగాణలో అధికార పార్టీ నేతలు అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపైన గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. గవర్నర్ జోక్యం చేసుకోక పోతే ప్రజాపస్వామ్యానికి మరింత ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఇక ఇదే అంశంపై తెలంగాణ ఎన్నికల కమీషనర్ కు కూడా ఫిర్యాదు చేసినట్టు మల్ రెడ్డి రంగా రెడ్డి స్పష్టం చేసారు.

ధర్మాన్ని కాపాడాల్సిన పోలీసులే గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధులను వాహనాల్లో తరలించడం, ప్రలోభాలకు గురి చేయడం అత్యంత దారుణమైన అంశంగా కాంగ్రెస్ నేతలు పరిగణిస్తున్నారు. రాబోవు రోజుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని కాంగ్రెస్ విశ్లేషిస్తోంది.

English summary
The results of municipal elections are being torn between political parties in Telangana. Mainly sparked off controversy between the ruling Gulabi party and Congress parties. The Congress party has sharply criticized the TRS party for making several attempts to turn the candidates to their side, who have won from congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X