కొండా Vs కాంగ్రెస్ నేతలు, హైకమాండ్ సీరియస్ - కీలక పరిణామాలు..!!
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పార్టీ నేతలు కొండా మురళీకి వ్యతిరే కంగా సమావేశం అయ్యారు. హైకమాండ్ కు మురళీ పైన ఫిర్యాదు చేసారు. పార్టీ చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేసారు. ఢిల్లీలో ఉన్న సీఎం ఈ పరిణామాల పైన ఆరా తీసినట్లు సమాచారం. అటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ ఈ వ్యాఖ్యలు.. సమావేశాల పైన నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఇటు మురళీ పై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ మురళీ వ్యాఖ్యలతో ఒక్క సారిగా నేతల మధ్య విభేదాలు బయటకు వచ్చాయి. మురళీ తాజాగా చేసిన వ్యాఖ్యల పైన పార్టీ నేతలు సమావేశమయ్యారు. జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో భేటీ అయిన నేతలు తాజా వ్యాఖ్యలు.. భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ ఎంపీ కావ్య హాజరైనట్లు తెలుస్తోంది. ఇష్టారీతిన మాట్లాడడం సరికాదని నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

బీసీ కార్డు అడ్డం పెట్టుకుని పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించొద్దని సూచించారు. ఈ పరిణా ల పైన హైకమాండ్ ఫోకస్ చేసి ఇప్పటికైనా ఆలోచన చేయాలని కోరారు. అటు వరంగల్ జిల్లాలోని పార్టీ నేతల పై కొండా మురళీ చేసిన వ్యాఖ్యలను కొందరు నేతలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ కు ఫిర్యాదు చేసారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో మీనాక్షి మాట్లాడినట్లు సమాచారం. అదే సమయంలో వరంగల్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు.. తాజాగా కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు... పార్టీ నేతల సమావేశం పైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇద్దరు మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల పైన ఓపెన్ గా చేసిన వ్యాఖ్యల పైన పార్టీ నాయకత్వం ఆగ్ర వ్యక్తం చేసింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో వరంగల్ లాంటి కీలక జిల్లాలో సొంత పార్టీ నేతల తీరు పైన ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. దీంతో, వరంగల్ పార్టీ నేతల పంచాయితీ పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications