ఎన్నికల వేళ ఏంటీ వివాదాలు - రేవంత్ వ్యాఖ్యలపై హైకమాండ్ ఆగ్రహం..!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం మొదలైంది. పార్టీ దూసుకువెళ్తున్న వేళ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. పార్టీ హైకమాండ్ రేవంత్ పై ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీల చర్చ సాగుతోంది. అమెరికా పర్యటనలో ఉచిత విద్యుత్ పైన చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ కు అస్త్రంగా మారింది. దీనిని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. పార్టీ బలోపేతం అవుతున్న వేళ ఈ కామెంట్స్ తో ప్రత్యర్ధి పార్టీలకు అవకాశం ఇవ్వటం కాదా అంటూ ఆగ్రహించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ వివాదాస్సదంగా మారుతున్న రేవంత్ వ్యాఖ్యల తీరు పైన హైకమాండ్ వివరణ కోరినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ బలోపేతం అవుతున్న వేళ ఈ కామెంట్స్ తో ప్రజల్లో పలచన అవుతామనే అభిప్రాయం ఢిల్లీ నేతల్లో వ్యక్తం అయినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీకి నష్టం చేస్తే ఏ స్థాయిలో వారినైనా ఉపేక్షించేది లేదని పార్టీ నాయకత్వం స్పష్టం చేస్తోంది. భట్టి పాదయాత్ర..ఖమ్మం సభతో పార్టీలో కొత్త జోష్ మొదలైందని పార్టీ నేతలంతా భావిస్తున్నారు. ఈ సమయంలో పార్టీని నడిపించాల్సిన టీపీసీసీ చీఫ్ రేవంత్ తీరు పార్టీకి నష్టదాయంగా మారుతోందనే వాదన ఉంది. తన వ్యాఖ్యలతో పార్టీకి రేవంత్ డామేజ్ చేస్తున్నారనే అభిప్రాయం సొంత పార్టీలో బలంగా ఏర్పడుతోందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.

కాంగ్రెస్ లో ఎవరు సీఎం అనేది పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ సీఎంగా సీతక్క అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీని పైన పార్టీ నాయకత్వం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. రేవంత్ ప్రకటనతో పార్టీలో భిన్నాభిప్రాయాలు రాకుండా వెంటనే హైకమాండ్ సూచన మేరకు సీనియర్లు సరిదిద్దే ప్రయత్నం చేసారు. ఉచిత విద్యుత్ పైన రేవంత్ చేసిన వ్యాఖ్యలు బూమ్ రాంగ్ అయ్యాయి. పార్టీకి నష్టం చేసేవిలా ఉన్నాయని పార్టీ హైకమాండ్ ఆగ్రహంతో ఉంది. ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసనలకు దిగింది. దీంతో నేరుగా పార్టీ అధినాయకత్వమే రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఉచిత విద్యుత్ కొనసాగింపు పైన హామీ ఇచ్చింది.
గతంలో సీనియర్లకు వ్యతిరేకంగా రేవంత్ మద్దతు దారులు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టిన వ్యవహారం పైన నేతలు నేరుగా ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలకు ఫిర్యాదులు చేసారనే వాదన ఉంది. పార్టీ సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా రేవంత్ తన మద్దతు దారులను ప్రోత్సహించటం వంటివి పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. వరుసగా ఇలాంటి చర్యలు..వ్యాఖ్యలతో పార్టీకి ఎన్నికల వేళ నష్టం కలిగేలా రేవంత్ వ్యవహరించటం పార్టీ నాయకత్వానికి రుచించటం లేదని సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో హైకమాండ్ రేవంత్ ను వివరణ కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు టీ కాంగ్రెస్ లో ఆసక్తి కర చర్చగా మారింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications