వరంగల్ లోక్ సభలో హస్తం హవా, తెలంగాణాలో కాంగ్రెస్ లీడింగ్ నియోజకవర్గాలివే!!

లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ లో ఇప్పటివరకు ఏడు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఆధిక్యతను కనపరుస్తుంది. వరంగల్, ఖమ్మం, జహీరాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, భువనగిరిలోనూ, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతుంది.

వరంగల్ లో ఆధిక్యంలో కడియం కావ్య
వరంగల్ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ లో తొలి రౌండు పూర్తయ్యేసరికి బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ 21,719 ఓట్లను సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య 30వేల 123ఓట్లను సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ 14,683 ఓట్లను సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య తొలి రౌండులో 8404 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారని అధికారికంగా వెల్లడించారు.

congress josh in Warangal Lok Sabha here are the Congress leading constituencies in Telangana

జహీరాబాద లోనూ కాంగ్రెస్ దూకుడు
జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లోనూ కాంగ్రెస్ దూకుడు కొనసాగిస్తుంది. 2 రౌండ్ పూర్తయ్యేసరికి -కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ 51వేల 983 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్ధి బిజెపి అభ్యర్థి బి బి పాటిల్ 44 వేల 482 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్ధిపై 7 వేల 581 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

పెద్దపల్లిలో కాంగ్రెస్ హవా
మరోవైపు పెద్దపల్లి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతుంది. పెద్దపల్లి లోక్ సభ స్థానంలో ఒక రౌండ్ పూర్తి అయ్యేసరికి బిజెపి అభ్యర్థి గోమాస్ శ్రీనివాస్ 18041 ఓట్లను సాధించగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 23495 ఓట్లను సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 9312ఓట్లను సాధించారు. 5094 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ లీడ్ లో ఉన్నారు.

మహబూబాబాద్ లో కాంగ్రెస్ ఆధిక్యం
ఇక మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనపరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ మహబూబాబాద్ లోక్సభ పరిధిలో మొదటి రౌండ్ ముగిసే సరికి 10385 మెజార్టీతో ముందంజలో ఉన్నారు. చిన్న తెలంగాణలో ఎన్ని చోట్ల కాంగ్రెస్ తెలంగాణలో ఎన్ని చోట్ల కాంగ్రెస్ మెజారిటీ లో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+