కాంగ్రెస్‌కు భారీ షాక్: జానా, రేవంత్, సుహాసిని, డీకే అరుణ.. వెనుకంజలో మహామహులు

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వెనుకంజలో ఉన్నారు. మహామహులైన నేతలు వెనుకబడటం గమనార్హం. దాదాపు ప్రతి నియోజకవర్గానికి 14 నుంచి 20కి పైగా రౌండ్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో తొలి రౌండ్లు తెరాసకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు అయి ఉంటే ఆ తర్వాత ట్రెండ్స్ మారుతాయి. అయినప్పటికీ కీలక నేతలు వెనుకబడటం గమనార్హం.

హుస్నాబాద్ నుంచి సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి వెనుకంజలో ఉన్నారు. తెరాస నేతలు కేసీఆర్, హరీష్ రావు, కేటీ రామారావులు ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ కీలక నేతల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే ముందంజలో ఉన్నారు.

Congress key leaders trailing in Telangana Congress assembly results

ఇక, వెనుకబడిన కాంగ్రెస్, టీడీపీ పార్టీల విషయానికి వస్తే నందమూరి సుహాసిని, జానారెడ్డి, డీకే అరుణ, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, సబితా ఇంద్రా రెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జీవన్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి, సునితా లక్ష్మారెడ్డి వంటి కీలక నేతలు వెనుకబడ్డారు. బీజేపీ నుంచి డాక్టర్ కె లక్ష్మణ్ వెనుకంజలో నిలిచారు. రేవంత్ రెడ్డి కూడా వెనుకంజలో ఉండటం గమనార్హం.

Congress key leaders trailing in Telangana Congress assembly results

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+