Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Telangana Assembly Elections 2023: ఆదివారం ఖానాపూర్, అసిఫాబాద్‍లో ప్రచారం చేయనున్న ప్రియాంక గాంధీ.. ‍

తెలంగాణలో కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ పలు దఫాలుగా రాష్ట్రంలో ప్రచారం చేశారు. ప్రియాంక గాంధీ కూడా పలు విడతలుగా వచ్చారు. ఆదివారం కూడా ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఆమె ఖానాపూర్, అసిఫాబాద్ నియోజకవర్గాల్లో ప్రచార చేయనున్నారు. ప్రియాంక గాంధీ మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఖానాపూర్ చేరుకుంటారు.

అక్కడ గంట పాటు ప్రచారం చేస్తారు. అక్కడి నుంచి అసిఫాబాద్ కు వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు అసిఫాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆ తర్వాత నాగోబా దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ నుంచి ఒక లంబాడా తండాలో మహిళలతో కలసి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రచారం చేస్తారు. అక్కడ మహిళలతో కలిసి గిరిజనుల ప్రత్యేక వంటకాలు వండి భోజనాలు చేస్తారు. మహిళలతో కలిసి ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేస్తారు. తిరిగి మద్యాహ్నం 1 గంటకు అసిఫాబాద్ నుంచి నాందేడ్ తిరుగు ప్రయాణమవుతారు.

Congress leader Priyanka Gandhi will campaign in Khanapur and Asifabad

రాహుల్ గాంధీ శుక్రవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారమిస్తే ఆరు గ్యారంటీలను తప్పుకుండా అమలు చేస్తామని చెప్పారు. వరంగల్‌ రుద్రమదేవి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రాహుల్ పాల్గొన్నారు. ఎక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైనా ఆ రాష్ట్రంలో ప్రతి పైసా పేదలకే వెళ్తుందని రాహుల్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్, భాజపా నేతలు కొంత మందికి మాత్రమే లబ్ధి చేకూరుస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీతన మిత్రుడు అదానీకి, సీఎం కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులకు లాభం జరిగేలా చేస్తున్నారని ఆరోపించారు.

అంతకు ముందు రాహుల్ గాంధీ మణుగూరు ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. రోడ్ షోలో పాల్గొని కార్నర్ మీటింగా లో ప్రసంగించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పేదల కోసమే పని చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని కోరారు. ఆరు గ్యారెంటీలతో పాటు రూ.2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+