2024లోనూ నరేంద్ర మోడీదే అధికారం, భారతరత్న ఇవ్వాలి: కాంగ్రెస్ నేత శంకర్రావు సంచలనం

హైదరాబాద్: ఆయనో కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యంగా సోనియా గాంధీకి పరమ భక్తుడు కానీ, ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోనియా గాంధీకి గుడి కూడా కట్టిన మాజీ మంత్రి శంకర్రావు.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీనే మరోసారి ప్రధాని కావాలని కోరుకోవడం గమనార్హం.

మీషా ఘోషల్ ట్రెడిషినల్ లుక్ ట్రెండింగ్.. అందంగా ముద్దు ముద్దుగా...

మళ్లీ మోడీనే ప్రధాని అవుతారు..

మళ్లీ మోడీనే ప్రధాని అవుతారు..

వచ్చే(2024) ఎన్నికల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీనే అధికారంలోకి వస్తారని శంకర్ రావు అన్నారు. దేశ ప్రజల మీద కరోనా ప్రభావం ఎక్కువగా పడకుండా ఆయన ముందు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. తాను రాజకీయ నాయకుడిగా కాకుండా.. ఒక డాక్టర్‌గా మాట్లాడుతున్నానని ఆయన అన్నారు.

నరేంద్ర మోడీకి భారతరత్న ఇవ్వాలంటూ రాష్ట్రపతికి లేఖ

నరేంద్ర మోడీకి భారతరత్న ఇవ్వాలంటూ రాష్ట్రపతికి లేఖ

అంతేగాక, ప్రధాని నరేంద్ర మోడీకి భారతరత్న ఇవ్వాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. మోడీ పేరును గిన్నిస్ బుక్‌లో ఎక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆరున్నరేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని శంకర్రావు ప్రశంసించారు. మోడీకి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

నరేంద్ర మోడీపై శంకర్రావు ప్రశంసలు

నరేంద్ర మోడీపై శంకర్రావు ప్రశంసలు

ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారని ప్రధాని మోడీని కొనియాడారు. భారతదేశంలో 90 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. జీఎస్టీ బిల్లు, కరోనా ప్రభావం తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి తొందరగా కోలుకునేందుకు కృషి చేయడంలో మోడీ విజయం సాధించారని అన్నారు.

బీజేపీలో చేరనంటూ శంకర్రావు ట్విస్ట్..

బీజేపీలో చేరనంటూ శంకర్రావు ట్విస్ట్..

మొదటిసారి ఇజ్రాయెల్ దేశంలో పర్యటించి.. ఆ దేశంతో మంచి సంబంధాలు నెలకొల్పారని మోడీని కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించారని ప్రశంసించారు. అయితే, తాను బీజేపీలో చేరనని స్పష్టం చేశారు. ప్రధాని మోడీనే మరోసారి అధికారంలోకి వస్తారని పునరుద్ఘాటించారు. అంతేగాక, రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగానే పనిచేస్తోందన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో గతంలో సీనియర్ నేతగా కొనసాగిన శంకర్రావు.. గత కొంత కాలంగా పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.


అంజు కురియన్ క్యూట్ గ్యాలరీ.. వైరల్ అవుతున్న లవ్లీ పిక్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+