వంద కోట్లు ఖర్చు చేసినా కోమటిరెడ్డి ఓటమి ఖాయం: వేముల వీరేశం
హైదరాబాద్: వంద కోట్లు ఖర్చు చేసిన వచ్చే ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించలేడని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గన్ మెన్ల ఉపసంహరణ వెనుక ఎలాంటి రాజకీయం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
గురువారం నాడు అసెంబ్లీ లాబీల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మీడియాతో చిట్ చాట్ చేశారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పతనం ఎప్పుడో ప్రారంభమైందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనుల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంట్రాక్టులు నిర్వహిస్తున్నారని వేముల వీరేశం ఆరోపించారు. వంద కోట్లు ఖర్చు పెట్టినా కానీ వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించలేరని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వంద కోట్లు ఖర్చు పెట్టినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించరని ఆయన అభిప్రాయపడ్డారు.
నల్గొండ జిల్లా నుండి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించలేరని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. నల్గొండలో కోమటిరెడ్డిని ఢీకొట్టే శక్తి టిఆర్ఎస్‌కు ఉందని చెప్పారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గన్‌మెన్ల ఉప సంహరణ వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశ్యం లేదన్నారు. నల్గొండలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిఆర్ఎస్ అభ్యర్ధి భూపాల్ రెడ్డి విజయం సాధిస్తారని వేముల వీరేశం ధీమాను వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications