తెలంగాణలో మరో ఉప ఎన్నిక, అనూహ్య పరిణామాలు..సై..!!

తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుందా. కాంగ్రెస్ శిబిరంలో ఇప్పుడు ఈ విషయం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ లో గెలుపుతో పార్టీలో జోష్ పెరిగింది. అటు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతున్న పార్టీ నేతలు.. ఇదే సమయంలో నగరంలో ఉప ఎన్నిక ద్వారా పై చేయి సాధించాలని భావిస్తున్నారు. దీని ద్వారా గ్రేటర్ ఎన్నికలకు బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలోకి నెట్టాలనేది అసలు టార్గెట్ గా కనిపిస్తోంది. దీంతో, మరో ఉప ఎన్నిక పైన మంత్రాంగం చేస్తున్న నేతలు.. అధికారికంగా నిర్ణయం వెల్లడించనున్నారు.

తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా మరో ఉప ఎన్నిక దిశగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ లో గెలుపుతో జోష్ పెరిగింది. ఈ నెల 17న జరిగే మంత్రివర్గ భేటీలో స్థానిక సంస్థ ల ఎన్నికల నిర్వహణ పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇక.. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రేవంత్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్ పరిధిలో మరో ఉప ఎన్నిక పైన చర్చ మొదలైంది. ఈ సారి జూబ్లీహిల్స్ పక్కనే ఉన్న ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి సీనియర్ నేత దారం నాగేందర్ గెలుపొందారు. అయితే బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన దానం.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. అంతేకాకుండా 2024 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.

congress leaders expecting another by poll in Hyderabad city soon details here

దీంతో, దానం పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. సుప్రీం ఆదేశాల మేర కు స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన విచారణ కొనసాగుతోంది. కాగా.. తాజాగా తమ ఫిర్యాదును స్పీకర్ త్వరగా పరిష్కరించడం లేదని కోర్టును ఆశ్రయించింది. అయితే, ఫిర్యాదులు ఎదుర్కొంటు న్న వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందరుకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయ ని అంటున్నారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ విషయంలో ఆయన తప్పించుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే అనర్హతకు ముందే దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం కాంగ్రెస్ నేతల్లోనే వమొదలైంది. దానం అందుకు సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు.

కాగా, సీఎం రేవంత్ సరైన సమయంలో దానం రాజీనామా పైన నిర్ణయం తీసుకుంటారని పార్టీ ముఖ్యులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఫలితం తరువాత దానం పైన రేవంత్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా ఖైరతాబాద్ లోనూ తమ బలం నిరూపించి... గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పైన వ్యూహాత్మకంగా పై చేయి సాధించాలనేది రేవంత్ లక్ష్యంగా ఉంది. అయితే, జూబ్లీహిల్స్ ఫలితం తరువాత బీఆర్ఎస్ దానం పైన చర్యల కోసం ఇప్పటి వరకు చేసిన విధంగానే ఒత్తిడి చేస్తుందా.. లేక, వేచి చూస్తుందా అనేది తేలాల్సి ఉంది. బీఆర్ఎస్ మరోసారి ముందుకు వస్తే.. ఇక దూకుడు గానే వెళ్లాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ వ్యవహారం పైన వచ్చే వారం కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+