రైతు లింబయ్య కుటుంబానికి కాంగ్రెస్ రూ. లక్ష సాయం, భరోసా(పిక్చర్స్)
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న బి లింబయ్య అలియాస్ లింబాదరి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు గురువారం పరామర్శించారు. నిజామాబాద్ జిల్లాలోని సదాశివనగర్ మండలంలో రామారెడ్డి గ్రామాన్ని సందర్శించిన నేతలు లింబాదరి కుటుంబానికి రూ. లక్ష ఆర్థికసాయం అందించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డికి చెందిన ఫౌండేషన్ తరపున ఈ మేరకు ఆర్థిక సాయాన్ని అందించారు. బుధవారం హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఓ స్తంభానికి ఉరివేసుకుని లింబయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
రైతు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపి మధు యాష్కీ, మాజీ ఎమ్మెల్యే గంగారాం, మున్సిపల్ ఛైర్మన్ సుష్మా, సీనియర్ నాయకులు నల్లమడుగు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, నేతలు పాల్గొన్నారు.
రూ.లక్ష సాయం అందజేయడంతో పాటు లింబయ్య కుమారుడి వైద్య ఖర్చులను భరిస్తామని కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ తెలిపారు. విదేశీ పర్యటనల మీద ఉన్న శ్రద్ద రాష్ట్రంలోని రైతులపై లేకుండా పోయిందని తెలంగాణ ప్రభుత్వంపై షబ్బీర్ అలీ మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నేతలు
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న బి లింబయ్య అలియాస్ లింబాదరి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు గురువారం పరామర్శించారు.

రైతు కుటుంబానికి సాయం
నిజామాబాద్ జిల్లాలోని సదాశివనగర్ మండలంలో రామారెడ్డి గ్రామాన్ని సందర్శించిన నేతలు లింబాదరి కుటుంబానికి రూ. లక్ష ఆర్థికసాయం అందించారు.

పరామర్శ
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డికి చెందిన ఫౌండేషన్ తరపున ఈ మేరకు ఆర్థిక సాయాన్ని అందించారు. బుధవారం హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఓ స్తంభానికి ఉరివేసుకుని లింబయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

పరామర్శ
రైతు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపి మధు యాష్కీ, మాజీ ఎమ్మెల్యే గంగారాం, మున్సిపల్ ఛైర్మన్ సుష్మా, సీనియర్ నాయకులు నల్లమడుగు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, నేతలు పాల్గొన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!

Click it and Unblock the Notifications