వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రూ.100 కోట్లకు పైగా మోసం చేసిన కాంట్రాక్టర్ ఎవరి స్నేహితుడు'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జిహెచ్ఎంసిలో అవినీతి పైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమాధానం చెప్పాలని, రూ.100 కోట్లకు పైగా మోసం చేసిన కాంట్రాక్టర్లు ఎవరి స్నేహితులు అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం నాడు ప్రశ్నించారు.

మృతి చెందిన మాజీ జవాను కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆసుపత్రికి వెళ్తే అడ్డుకోవడం సరికాదన్నారు. సైనికుల పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి ఎంత చిత్తశుద్ధి ఉందో దీనిని బట్టి తెలుస్తోందన్నారు.

KTR

రాహుల్ గాంధీని అడ్డుకోవడం ఏం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. సైనికులను మోడీ ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తున్నామని కాంగ్రెస్ నేత యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. భవిష్యత్తులో కేంద్రం విధానం ఇలాగే ఉంటే తీవ్ర ప్రతిఘటన తప్పదన్నారు.

మరో కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. రాహుల్‌ను అడ్డకున్నందుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు.

English summary
Congress leaders Uttam Kumar Reddy and Ponguleti Sudhakar Reddy question KTR and Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X