అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ముసురుకున్న వివాదాలు రోజురోజుకూ తీవ్ర రూపాన్ని దాల్చుతూ వస్తోన్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన.. అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చిన తరువాత ఈ వ్యవహారం మొత్తం రోజుకో మలుపు తిరుగుతోంది. అల్లు అర్జున్‌ను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చంద్రాయణగుట్ట శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సహా పలువురు సభ్యులు ఈ తొక్కిసలాట ఉదంతంపై ఘాటుగా స్పందించారు. అదేరోజు సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఈ వివాదానికి అడ్డుకట్ట వేయకపోగా మరింత ఆజ్యం పోసినట్టయింది.

Congress leaders reportedly instructed do not react on Allu Arjun and TFI

ఈ ప్రెస్ మీట్ తరువాత ఆయనపై దాడి మరింత తీవ్రతరమైంది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు బల్మూరి వెంకట్, విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్‌లో పశ్చాత్తాపం ఎంతమాత్రం కనిపించట్లేదని విమర్శించారు. పోలీసులను సైతం తప్పు పట్టేలా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

అదే సమయంలో అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి కిందటే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు విచారణకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట తండ్రి అల్లు అరవింద్, మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, లీగల్ టీమ్ సభ్యులు ఉన్నారు.

ఈ పరిణామాల మధ్య- అల్లు అర్జున్‌కు కొంత వరకు ఊరట కలిగించే ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దంటూ గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సమాచారం వెళ్లిందనే ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్‌తో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ సూచించినట్లు చెబుతున్నారు.

అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. గాంధీ భవన్‌కు వెళ్లి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షితో ప్రత్యేకంగా సమావేశమైన అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని అంటోన్నారు.

అల్లు అర్జున్‌పై ప్రధానంగా కాంగ్రెస్ నుంచే దాడి జరుగుతోందని, దీనికి పుల్ స్టాప్ పడేలా నిర్ణయాలను తీసుకోవాలంటూ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారని, దీని పట్ల దీపా దాస్ మున్షీ సానుకూలంగా స్పందించారని, పార్టీ వరకు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా చేసుకుంటానని హామీ ఇచ్చారని, ఈ క్రమంలోనే పార్టీ నాయకులు, కార్యకర్తలకు పీసీసీ నుంచి సమాచారం వెళ్లిందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+