బీఆర్ఎస్ కంచుకోట్లలో కాంగ్రెస్ హవా - ఏకపక్షంగా ఫలితాలు..!!

తెలంగాణ ఫలితాల్లో తొలి ట్రెండ్స్ కాంగ్రెస్ కు ఏపక్షంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ను రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అన్ని ప్రాంతాల్లోనూ డామినేట్ చేస్తోంది. బీఆర్ఎస్ కు మంచి పట్టున్న నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెల్లడువుతున్న ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ ఖాయమనే దిశగా అంచనాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ పోటీ నామమాత్రంగా మారుతోంది. బీజేపీ మూడు నియోజకవర్గాల్లోనే ఆధిక్యతలో ఉంది.

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. బీఆర్ఎస్ కంచుకోటల్లో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెల్లడువుతున్న ఫలితాలు ఓటర్ల మూడ్ ను స్పష్టం చేస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్దులు ఏకపక్షంగా దూసుకెళ్తున్నారు. తొలి ట్రెండ్స్ లో కాంగ్రెస్ 42 స్థానాల్లో మెజార్టీ కొనసాగుతుండగా.. బీఆర్ఎస్ కేవలం స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. దీని ద్వారా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గజ్వేల్ లో తొలి రౌండ్ లో కేసీఆర్ ఆధిక్యతలో ఉన్నారు. ఖమ్మంలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల ముందంజలో ఉండగా.. మధిర లో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్ధి భట్టి విక్రమార్క ముందంజలో నిలిచారు.

Congress leads in BRS Strong hold Areas in Northern and South Telangana

ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ ఏకపక్షంగా ఓట్లు సాధించినట్లు స్పష్టం అవుతోంది. పాలేరు లో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధిక్యతలో ఉన్నారు. బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణ పైన కాంగ్రెస్ పూర్తి పట్టు సాధించినట్లు కౌంటింగ్ తొలి ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. అదే విధంగా నల్గొండ, వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు సైతం వెనుకబడ్డారు. మధిరలో భట్టి విక్రమార్క్ ఆధిక్యంలో ఉన్నారు. హుస్నాబాద్ లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఏడు చోట్ల, ఒక చోట స్వతంత్ర అభ్యర్ది ముందంజలో ఉన్నారు. సనత్ నగర్ లో తలసాని ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

భువనగిరిలో తొలి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. ఇప్పటి వరకు బీజేపీ 4 స్థానాల్లో మాత్రం ముందంజలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అయితే, ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కావటంతో ఇప్పటి నుంచి వచ్చే ఫలితాలు తుది రిజల్ట్ ను స్పష్టం చేయనుంది. కామారెడ్డి, కొడంగల్ లో రెండు స్థానాల్లోనూ రేవంత్ ముందంజలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ లో కాంగ్రెస్ మెజార్టీ నియోజకవర్గాల్లో ముందంజలో కొనసాగుతుండటంతో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. బీఆర్ఎస్ పట్టున్న నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఆధిక్యత..తుది ఫలితం పైన స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+