Jubilee hills: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు వెనుక ఆ ఇద్దరు - అక్కడే మలుపు..!!
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగా నే ఫలితాల సరళి ఉంది. బీఆర్ఎస్ లెక్కలు పని చేయలేదు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ మెజార్టీ కొనసాగింది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ స్వల్ప మెజార్టీ సాధించింది. ముందు నుంచి పక్కా ఉప ఎన్నిక కోసం అమలు చేసిన వ్యూహాలు ఫలితాన్ని ఇచ్చాయి. ఈ ఫలితం పైన కాంగ్రెస్ నేతలు అంచనాతో ఉన్నా.. చివరి వరకు కొంత ఆందోళన కనిపించింది. ఈ గెలుపు వెనుక ఇద్దరి పాత్ర ప్రధానంగా కనిపిస్తోంది. వారి ఎంట్రీనే కీలక మలుపుగా మారింది.
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు లాంఛనం. భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఈ ఎన్నిక లో గెలుపు కోసం తొలి నుంచి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. జూబ్లీహిల్స్ లో ఆరో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ 15,589 ఓట్ల మెజార్టీ తో ముందంజలో కొనసాగుతోంది. ఈ ఉప ఎన్నిక లో గెలవాల్సిందేనని కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ కు నిర్దేశించింది. పార్టీ అభ్యర్ధి ఖరారు నుంచి సీఎం రేవంత్ వ్యూహాలు ఫలించాయి. రేవంత్ తో పాటుగా పార్టీ వ్యూహాకర్త సునీల్ కనుగోలు వ్యూహాలను రచించారు. కొన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఒపీనియన్ పోల్స్ ఇచ్చాయి. దీంతో.. రేవంత్ అలర్ట్ అయ్యారు.

చివరి వారం వరకు కాంగ్రెస్ నేతల్లో కనిపించని కాన్ఫిడెన్స్ ఆ తరువాత పెంచే బాధ్యత రేవంత్ తీసుకున్నారు. చివరి వారంలో ఏం చేయాలో దిశానిర్దేశం చేసిన రేవంత్... స్వయంగా ప్రచారంలో కి దిగారు. దీంతో, కేడర్ లో జోష్ పెరిగింది. బీఆర్ఎస్ బలాలు - బలహీనతలే లక్ష్యంగా రేవంత్ తన వ్యూహాలను అమలు చేసారు. బీజేపీ పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితిని అనుకూలంగా మలచు కోవటంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. పోల్ మేనేజ్మెంట్ పై బూత్ ఏజెంట్లకు, బూత్ ఇంచార్జీలకు సీఎం ఇచ్చిన ప్రణాళికలు సఫలం అయ్యాయి. ఈ ఫలితం ద్వారా తనపై ఇన్ని రోజులుగా వస్తున్న విమర్శలకు గెలుపుతో రేవంత్ సమాధానం ఇచ్చినట్లు అయింది. జూబ్లీహిల్స్ గెలుపుతో మరింత స్ట్రాంగ్‌గా సీఎం రేవంత్ మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపై గేరు మార్చి ముఖ్యమంత్రి తన స్పీడ్ పెంచనున్నారు.
ఇక, పోస్టల్ బ్యాలెట్ నుంచి కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. రౌండ్ల వారీగా కాంగ్రెస్ ఆధిక్యాలు పరిశీలిస్తే.. తొలిరౌండ్ 47, రెండో రౌండ్ 2,995, మూడోరౌండ్ 2,843, నాలుగో రౌండ్ 3,547, ఐదో రౌండ్ 3,178 ఓట్ల ఆధిక్యం సాధించింది. బీఆర్ఎస్ తొలి మూడు రౌండ్లలో గట్టి పోటీ ఇవ్వగలిగినా.. ఎక్కడా కాంగ్రెస్ ను అధిగమించ లేకపోయింది. దీంతో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ వరుసగా రెండో సిట్టింగ్ స్థానం కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఇక్కడ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ీ ఎన్నికల్లో గెలిచింది నవీన్ అయినా.. రేవంత్ తానే అభ్యర్దిలా పని చేసారు. ఈ విజయం నవీన్ కంటే రేవంత్ కు చాలా కీలకం. దీంతో.. ఈ గెలుపు ద్వారా తన పట్టు మరింత పెంచుకున్నారు.
-
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications